గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన అబ్దుల్ రహీం... తన ఇంట్లో శుభకార్యం నిర్వహిస్తున్న సమయంలో భారీ చోరీ జరిగింది. రహీం మేనకోడలి భర్త... అలీ హర్మస్ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అదును చూసిన అలీ.. బీరువాలో ఉన్న 153 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించాడు.
సాయంత్రం సమయంలో అబ్దుల్ రహీం కుటుంబ సభ్యులు బీరువాను తెరిచి చూడగా నగలు కనిపించలేదు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. శుభ కార్యానికి హాజరైన వారి వివరాలు సేకరించారు. చివరికి.. అలీ హర్మాస్ ను నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండి: