రాష్ట్రంలో మాల, మాదిగల మధ్య చిచ్చుపెట్టిన మందకృష్ణ మాదిగ.. నేడు గుంటూరు వచ్చి సమయమనం పాటించాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నవరపు కిషోర్ అన్నారు. వెలగపూడిలో స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఎంపీ సురేష్ ఆధ్వర్యంలో దాడి జరిగితే ఆయన ఎందుకు స్పందిచలేదని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు నోటాకి ఓటు వేయమని చెప్పిన మందకృష్ణ మాదిగ.. నేడు మాదిగలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడం దారుణమన్నారు. వైకాపాలో మాదిగలకు అన్యాయం జరుగుతుందని గగ్గోలు పెడుతున్న తెదేపా నేత వర్ల రామయ్య.. దళితుల మధ్య మరింత చిచ్చుపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
ఇదీ చదవండి: వెలగపూడి ఘటనలో వారిద్దర్ని అరెస్ట్ చేయాలి: వర్ల రామయ్య