గుంటూరు జిల్లా పెదనందిపాడులో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విశాఖలో స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్ళకు పైగా గడుస్తున్నా ఇంకా ఇంకా అంటరానితనం, కుల వివక్ష నెలకొందని.. దానికి నేనూ బాధితుడినే అని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు ఆవేదన వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీ150వ జయంతి పురస్కరించుకుని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
మహాత్మాగాంధీ ప్రపంచానికే ఆదర్శవంతమైన నాయకుడు. బాపూజీ ఆదర్శాలను పుణికి పుచ్చుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.
మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని విజయనగరం కలెక్టరేట్ ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలో మహాత్మాగాంధీ 150 వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
గాంధీజీ 150వ జయంతి ఈ సందర్భంగా కృష్ణాజిల్లాలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు నెల్లూరులో ఘనంగా జరిగాయి. నగరంలోని గాంధీ విగ్రహానికి జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కలెక్టర్ శేషగిరి బాబు, ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
విజయనగరం జిల్లా బొబ్బిలిలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శంబంగి వెంకట అప్పల నాయుడు హాజరయ్యారు. గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఇదీ చదవండి:'మహాత్మా...మళ్లీ రావా'