తెనాలి రచయిత షేక్ అబ్దుల్ జాని రచనకు మంచి గౌరవం దక్కింది. మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి 12వ తరగతి తెలుగు మాధ్యమం విద్యార్థుల కోసం 2020-21 విద్యా సంవత్సరానికి గాను రూపొందించిన యువ భారతి పాఠ్య పుస్తకంలో ఈయన రచనకు చోటు దక్కింది. ఆయన రాసిన అమ్మఒడి కథల సంపుటిలోని కొత్త వెలుగు కథను ఈ పుస్తకంలో పాఠ్యాంశంగా చేర్చారు.
గతేడాది హకీం రచించిన 'బాధ్యతాయుత పౌరుడు' కథను 11వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో మహారాష్ట్ర ప్రభుత్వం చేర్చింది. రెండో ఏడాది ఆయనకు వరుసగా ఈ గౌరవం దక్కింది. తన కథను ఎంపిక చేసిన కమిటీ ప్రతినిధులకు హకీం జానీ కృతజ్ఞతలు తెలిపారు. పుణే ప్రధాన కార్యాలయంగా ఉన్న మహారాష్ట్ర పాఠ్య పుస్తక నిర్మాత, పాఠ్య ప్రణాళిక పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో ఈ పుస్తకం ప్రచురితమైంది.
రచయిత పరిచయాన్ని సైతం పాఠ్యాంశం చివరిలో పొందు పరిచారు. బాలసాహిత్యంలో హకీం జానీ ఇప్పటివరకు 250 కథలు, 33 వయోజన వాచకాలు, 30 బాలసాహిత్య పుస్తకాలు, 4 గ్రంథాలు వెరసి 68 పుస్తకాలను రచించారు.
ఇదీ చదవండి :