గుంటూరులోని ఆమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అమ్మ మహాప్రాస్థానాన్ని ఏర్పాటు చేశారు. గుంటూరు సంయుక్త కలెక్టర్ దినేశ్ కుమార్, డాక్టర్ శ్రీవిద్య, ట్రస్ట్ నిర్వహకులు జ్ఞాన ప్రసన్నాంబ బాబా మహాప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం ఓ మృతదేహనికి దహన సంస్కారాలు నిర్వహించారు. కరోనాతో మరణించిన వారికి అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారు ముందుకు వచ్చి అంత్యక్రియలు చేయడం మంచి విషయమని సంయుక్త కలెక్టర్ దినేశ్ కుమార్ అన్నారు. కొవిడ్ కారణంగా, నిస్సహాయులకు అంత్యక్రియలు చేయడానికి గుంటూరులో స్తంభాలగరువు లో గ్యాస్ తో ఏర్పాటు చేసిన అధునాతన యంత్రాన్ని ప్రారంభించామని తెలిపారు. సంప్రదాయ పద్దతిలో దహనం చేయడానికి అమ్మ మహాప్రస్థానం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇక్కడ ఒకేసారి నాలుగు మృతదేహాలను దహనం చేసే విధంగా గదులను ఏర్పాటు చేశామన్నారు.
ఇదీ చదవండి