Lumpy skin disease in Guntur: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ప్రాతూరులో సుమారు 26 పశువులకు లంపి వైరస్ లక్షణాలు సోకినట్లు పశు వైద్యులు వెల్లడించారు. మండలంలో 26 పశువులకు వైరస్ లక్షణాలు ఉండటంతో.. గోపాల్ మిత్ర సహాయంతో వాటికి టీకాలు వేశారు. ప్రాతూరులోని ఎస్సీ కాలనీలో ఆవులకు లంబి వైరస్ లక్షణాలు బయటపడటంతో.. వాటి కాపర్లు ఆందోళన వ్యక్తం చేశారు. కాల్ సెంటర్కు సమాచారం ఇచ్చినా.. ఎవరూ రాలేదని గ్రామస్థులు వాపోయారు. ఆవులలో వైరస్ లక్షణాలు ముదిరి చర్మం పండ్లు పడే స్థాయికి చేరుకున్నాయని వాటి యజమానులు చెప్పారు. దీంతో అప్రమత్తమైన తాడేపల్లి పశు వైద్య అధికారులు మండలంలో ఉన్న ఆవులకు గోపాల మిత్రల ద్వారా వ్యాక్సిన్ వేయిస్తున్నారు.
ఇవీ చదవండి: