ETV Bharat / state

పొరుగు రాష్ట్రాల్లో లారీ కార్మికుల అవస్థలు - lorries struck in ap beside highways

లారీ చక్రం తిరిగితేనే వారి బతుకు బండి సాగుతుంది. లాక్‌డౌన్‌తో 20 రోజులుగా జనజీవనం స్తంభించిపోవడంతో కదిలే పరిస్థితి లేదు. మరోవైపు లాక్‌డౌన్‌కు ముందు వివిధ సరకులు, సామగ్రితో ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లిన లారీలు, పక్క రాష్ట్రాల నుంచి మన దగ్గరకు వచ్చినవి మూడు వారాలుగా నిలిచిపోవడంతో వాటి డ్రైవర్లు, క్లీనర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరకు దించేవారు లేక లారీలు నిలిపేయాల్సి వచ్చిందని వాపోతున్నారు.

lorries struck in ap beside highways
పొరుగు రాష్ట్రాల్లో లారీ కార్మికుల అవస్థలు
author img

By

Published : Apr 14, 2020, 6:13 AM IST

లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి దుకాణాలు, షోరూమ్‌లు, గోదాములు మూతపడ్డాయి. చాలావరకు పరిశ్రమలు తెరిచే అవకాశం లేకుండా పోయింది. దీంతో పొరుగు రాష్ట్రాల నుంచి సరకు తీసుకొచ్చిన డ్రైవర్లు లారీలను రోడ్ల పక్కనే నిలిపేయాల్సి వచ్చింది. టీవీలు, ఫ్రిజ్‌లు, కూలర్లు, వాషింగ్‌ మిషన్లు వంటి ఎలక్ట్రానిక్‌ వస్తువుల లోడుతో వచ్చిన లారీలు రాష్ట్రంలోని పలు నగరాల్లో నిలిచిపోయాయి. గోదాములు నిండిపోవడంతో వీటిని దించుకోలేమని డీలర్లు చెబుతున్నారు.

కొన్నిచోట్ల వీటిని దించేందుకు హమాలీలు సైతం రావడం లేదు. ఇనుము, టైల్స్‌, కాఫీ గింజలు, యంత్ర పరికరాలు వంటి ఇతర సామగ్రితో వచ్చిన పలు లారీలదీ ఇదే పరిస్థితి. దేశవ్యాప్తంగా 35 వేలకు పైగా లారీలు ఇలా వేరే రాష్ట్రాల్లో నిలిచిపోయినట్లు చెబుతున్నారు. వీటిలో మన రాష్ట్రానికి వచ్చి ఆగిపోయినవి వెయ్యి వరకు ఉన్నాయి.

లారీ కార్మికులకూ ఇక్కట్లు...

మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లిన లారీలు సైతం చిక్కుకుపోయాయి. విశాఖ నుంచి తారు లోడుతో తమిళనాడు, కర్ణాటక వెళ్లిన లారీలు అక్కడే నిలిచిపోయాయి. గోదావరి జిల్లాల నుంచి చేపల లోడుతో ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లి, మళ్లీ అక్కడి నుంచి వేరొక లోడు తీసుకొచ్చే ప్రయత్నంలో కొన్ని లారీలు ఉండిపోయాయి. ఏపీకి చెందిన దాదాపు 2,500 లారీలు పలు రాష్ట్రాల్లో ఆగిపోయినట్లు ఏపీ లారీ యజమానుల సంఘం తెలిపింది.

ఎన్ని రోజులు ఉండాలో..?

హరియాణా నుంచి ఎలక్ట్రానిక్స్‌ సామగ్రితో విజయవాడ వచ్చాం. లాక్‌డౌన్‌తో సామగ్రి దించే పరిస్థితి లేదని చెప్పారు. అప్పటి నుంచి లారీల్లోనే ఉంటున్నాం. మా దగ్గర డబ్బులు కూడా అయిపోయాయి. లారీ సంఘం వాళ్లు కొందరు సాయం అందించారు. ఇంకెన్ని రోజులు ఇక్కడే ఉండాలో అర్థం కావడం లేదు. - బాబూలాల్‌ బన్సాలీ, లారీ డ్రైవర్‌, హరియాణా

నూనె, కారం కలుపుకొని తింటున్నాం...

చేపల లోడుతో పశ్చిమగోదావరి జిల్లా నుంచి ఉత్తరప్రదేశ్‌లోని మహువా వచ్చాం. అక్కడి నుంచి మధ్యప్రదేశ్‌లోని కట్నీ వెళ్లి వైట్‌ సిమెంట్‌ లోడు వారణాసి తీసుకొచ్చాం. ఇది అన్‌లోడ్‌ అయితే వెనుదిరగాలనుకున్నాం. ఇంతలో లాక్‌డౌన్‌ ప్రకటించారు. తెచ్చుకున్న బియ్యం, పప్పులు వంటివన్నీ అయిపోతున్నాయి. వారం రోజులుగా కూరగాయలు కూడా దొరకడం లేదు. అన్నంలో పచ్చడి, కొన్నిసార్లు నూనె, కారం కలిపి తింటున్నాం. -వీరస్వామి, శ్రీనివాసరావు, వారణాసిలో తెలుగు డ్రైవర్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.