ETV Bharat / state

'పత్రిక ప్రకటనల ఖర్చుతో... భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవచ్చు'

ప్రభుత్వం పత్రిక ప్రకటనల కోసం వృథా చేసే ప్రజాధనంతో భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటే సంతోషిస్తామని లోకేశ్ ట్వీట్ చేశారు.

లోకేశ్
author img

By

Published : Nov 19, 2019, 1:55 PM IST

నూతన ఇసుక విధానంపై తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. సీఎంకు పేపర్​లో దొరుకుతున్న ఇసుక బయట ప్రజలకు ఎందుకు దొరకటం లేదని ఎద్దేవా చేశారు. ఇసుక అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతామని జగన్ భారీగా ప్రకటనలు ఇస్తున్నారని ట్విట్టర్​లో మండిపడ్డారు.ప్రభుత్వం చెప్పిన టోల్ ఫ్రీ నెంబర్ నిజంగా పనిచేస్తే... ఇసుకాసురుల కోసం పక్క రాష్ట్రం జైళ్లు కూడా అద్దెకు తీసుకోవాల్సి వస్తుందన్నారు. నూతన ఇసుక పాలసీతో 50 మంది కార్మికులు బలయ్యారని లోకేశ్​ ఆవేదన వ్యక్తం చేశారు. 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. ఇసుక రేటుని వైకాపా నాయకులు పెంచుకుంటూ పోతున్నారన్నారు. పత్రిక ప్రకటనలకు కోసం వృథా అవుతున్న ప్రజాధనంతో భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటే సంతోషిస్తామని లోకేశ్​ హితవు పలికారు.

పత్రిక ప్రకటనల ఖర్చుతో ... భవననిర్మాణ కార్మికులను ఆదుకోవచ్చు

ఇవీ చదవండి

అఖండ గోదావరిలో పేరుకుపోతున్న ఇసుక నిల్వలు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.