ETV Bharat / state

'జ‌గ‌న్ మాన‌సిక ప‌రిస్థితిపై గ‌వ‌ర్నర్ జోక్యం చేసుకుని కేంద్రానికి నివేదిక పంపాలి' - Chandrababu case updates

Lokesh Allegations on Jagan About Chandrababu Cases: సీఎం జగన్​ మానసిక పరిస్థితి బాగా లేదని.. వెంటనే సరైన వైద్యం చేసుకోవాలని నారా లోకేశ్​ ఎద్దేవా చేశారు. రాజకీయ కక్షతో చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.

lokesh_allegations_on_jagan
lokesh_allegations_on_jagan
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 2, 2023, 9:38 PM IST

Updated : Nov 2, 2023, 10:41 PM IST

Lokesh Allegations on Jagan About Chandrababu Cases: జ‌గ‌న్ మాన‌సిక ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌ర‌ స్థాయికి చేరింద‌ని.. గ‌వ‌ర్నర్ త‌క్షణ‌మే జోక్యం చేసుకుని కేంద్రానికి నివేదిక పంపాల‌ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేశ్​ ఎద్దేవా చేశారు. చంద్రబాబుపై రోజుకో త‌ప్పుడు కేసు పెడుతోన్న సీఎం జగన్​కి మానసిక పరిస్థితి ఆందోళనకర స్థాయికి చేరింద‌ని జ‌నం చ‌ర్చించుకుంటున్నార‌ని అన్నారు. క‌క్షతో ర‌గిలిపోతున్న జ‌గ‌న్ నైజం ఏంటో రాష్ట్ర ప్రజలకు పూర్తిగా అర్థం అయ్యింద‌ని తెలిపారు. సీఎం స్థానంలో ఉండి ఉన్మాదిలా మారి, సీఐడీని వైసీపీ అనుంబంధ విభాగంగా మార్చుకుని.. ప్రతిపక్ష నేతల మీద కేసుల మీద కేసుల పెట్టడం దేశ చరిత్రలో ఎక్కడా చూడ లేదన్నారు. ప్రతిప‌క్షాన్ని వేధించేందుకు వ్యవ‌స్థల్ని మేనేజ్ చేస్తూ.. ఈ స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడ‌డం దేశంలో ఏ రాష్ట్రంలోనూ జ‌ర‌గ‌లేద‌ని పేర్కొన్నారు.

Lokesh on Jagan: కేసుల నుంచి కుటుంబ రక్షణ కోసమే దిల్లీకి జగన్‌..: లోకేశ్

చంద్రబాబుపై ఆధారాల్లేని త‌ప్పుడు కేసులు వ‌ర‌ుస‌గా బ‌నాయించ‌డం చూసిన జ‌నం సీఎం జగన్​పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. జగన్ వెంటనే వైద్యపరీక్షలు జరుపుకోవాల‌ని కోరారు. జగన్ తీసుకునే దారుణ‌మైన నిర్ణయాలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అవుతుంద‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు. ప్రజ‌లు ఇచ్చిన అధికారాన్ని రాజ‌కీయ క‌క్ష సాధింపుల కోసం వాడుకుంటోన్న జ‌గ‌న్ దారుణ పరిస్థితిపై కేంద్రానికి అత్యవసరంగా గ‌వ‌ర్నర్ నివేదికలు పంపాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. స్కిల్ డెవ‌ల‌ప్​మెంట్​లో ఒక్క రూపాయి అవినీతి జ‌ర‌గ‌క‌పోయినా కేసు బనాయించార‌ని, వేయ‌ని రింగ్ రోడ్డుకు అలైన్​మెంట్ మార్చార‌ని అన్నారు. ఇలా ప్రతీ కేసులో ఈ రోజుకీ కూడా ఒక్క ఆధార‌మూ లేద‌ని అన్నారు.

'ప్రజల నుంచి దూరం చేసేందుకు వైసీపీ ఎన్ని కుట్రలు పన్నినా వచ్చే ఎన్నికల్లో చంద్రబాబే సీఎం'

ఉచితంగా ఇసుక ఇస్తే అందులో స్కాం ఉందంటూ ఇప్పుడు మరో కేసు పెట్టారని ఆరోపించారు. దేశంలోనే పేరుప్రఖ్యాతలు సంపాదించిన ఫైబ‌ర్ నెట్ ప్రాజెక్టుపై ఒక కేసు, తాను జె బ్రాండ్స్ మద్యం అమ్ముతూ చంద్రబాబుపై లిక్కర్ స్కాం కేసు పెట్టిన జ‌గ‌న్ మాన‌సిక ప‌రిస్థితి చూస్తుంటే జాలేయ‌డంతోపాటు ఆందోళ‌న క‌లిగిస్తోంద‌న్నారు. అభివృద్ధిలో దూసుకుపోతున్న రాష్ట్రాన్ని కక్షలు, రాజకీయ వేధింపులు, అస్థిరత్వం, విధ్వంసం వైపు తీసుకెళ్లిన‌ జ‌గ‌న్​ను అర్జంటుగా పిచ్చి ఆస్పత్రిలో చేర్పించాల‌ని సూచించారు. ప్రతి పక్ష నేతపై రోజుకో త‌ప్పుడు కేసు పెట్టడమే తన లక్ష్యం అన్నట్లు జ‌గ‌న్ వ్యవహరించడం దుర్మార్గమైన పాల‌న‌కి నిద‌ర్శన‌మ‌న్నారు.

Chandrababu Followers Highly Crowd on Roads: జనసంద్రమైన రోడ్లు.. ఉప్పొంగిన అభిమానం.. ఎక్కడ చూసినా సంబరాలే..

ఎన్నికలు ద‌గ్గర ప‌డుతున్న వేళ‌ తాను రాష్ట్రానికి ఏం చేశానో చెప్పుకోలేక ఇలా దొంగ కేసులతో జ‌గ‌న్ ప్రజలను తప్పదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. దేశంలోనే అతి ఎక్కువ కేసులు, లెక్కలేన‌న్ని ఆస్తుల‌తో అవినీతి పొలిటీషియన్​గా ముద్రపడిన జగన్ ఆ బురదను చంద్రబాబుకూ అంటించాలని చూస్తుండ‌డం దారుణ‌మ‌న్నారు. చంద్రబాబుపైనా, టీడీపీ నేత‌ల‌పైనా పెట్టిన ఏ ఒక్క కేసూ న్యాయ స్థానాల‌లో నిల‌బ‌డ‌వ‌ని, బాబుపై జ‌గ‌న్ గ్యాంగ్ చేస్తున్న త‌ప్పుడు ఆరోప‌ణ‌ల‌లో ఏ ఒక్కటీ ప్రజ‌లు న‌మ్మడంలేద‌ని లోకేశ్​ స్పష్టం చేసారు.

  • పిచ్చి జ‌గ‌న్ మాన‌సిక ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌ర‌స్థాయికి చేరింది, ఉన్మాదిలా మారి చంద్ర‌బాబు గారిపై రోజుకో త‌ప్పుడు కేసు పెడుతున్నాడు. గ‌వ‌ర్న‌ర్ త‌క్ష‌ణ‌మే జోక్యం చేసుకుని, కేంద్రానికి నివేదిక పంపాలి - నారా లోకేష్#PichiJagan #PyschoJagan#FalseCasesAgainstNaidu #NijamGelavalipic.twitter.com/7bCmLZNRM3

    — Telugu Desam Party (@JaiTDP) November 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Last Updated : Nov 2, 2023, 10:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.