ETV Bharat / state

"చలో కావ‌లి"లో అరెస్ట్​ చేసినవారిని వెంటనే విడిచిపెట్టాలి: నారా లోకేశ్

Nara Lokesh Fires On AP Police: నెల్లూరులో దళితులపై వరుస దాడులను నిరసిస్తూ టీడీపీ చేపట్టిన ''చలో కావ‌లి'' కార్యక్రమానికి పోలీసులు అడ్డంకులు సృష్టించారని లోకేశ్ ఆరోపించారు. ''చలో కావ‌లి'' కార్యక్రమాన్ని ఉక్కుపాదంతో అణిచివేయ‌డాన్ని నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. దళితులపై దాడులు సైకోపాల‌న‌కి పరాకాష్ట అని ధ్వజమెత్తారు.

Nara Lokesh
నారా లోకేశ్
author img

By

Published : Jan 10, 2023, 7:39 PM IST

Updated : Jan 10, 2023, 8:07 PM IST

Nara Lokesh Punches on CM Jagan: కావలి నియోజకవర్గంలో ఎస్సీలపై దాడులకు నిర‌స‌న‌గా తెదేపా ఎస్సీ సెల్ తలపెట్టిన "ఛ‌లో కావ‌లి" కార్యక్రమాన్ని ఉక్కుపాదంతో అణిచివేయ‌డాన్ని నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎస్.రాజుని అరెస్టు చేసిన పోలీసులు ఎటు తీసుకెళ్తున్నారో స‌మాచారం ఇవ్వక‌పోవ‌డం సైకోపాల‌న‌కు పరాకాష్ట అని ధ్వజమెత్తారు. ఎంఎస్ రాజుతోపాటు అరెస్ట్ చేసిన ఉద్యమ‌కారులంద‌రిపై బనాయించిన త‌ప్పుడు కేసులు ఉప‌సంహ‌రించుకుని, వారిని తక్షణమే విడిచి పెట్టాల‌ని డిమాండ్ చేశారు.

  • కావలి నియోజకవర్గంలో ఎస్సీలపై దాడులకు నిర‌స‌న‌గా టిడిపి ఎస్సీ సెల్ తలపెట్టిన``ఛ‌లో కావ‌లి`` కార్య‌క్ర‌మాన్ని ఉక్కుపాదంతో అణిచివేయ‌డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.(1/3)#DalitAtrocitiesInAP #IdhemKarmaManaRashtraniki #PsychoPovaliCycleRavali pic.twitter.com/w4hBk48iKh

    — Lokesh Nara (@naralokesh) January 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వైసీపీ వేధింపులతో పలువురు ఆత్మహత్య: ముసునూరు ప్రాంతానికి చెందిన కరుణాకర్ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన చావుకు అధికార పార్టీ నేతలే కారణమని సూసైడ్ నోట్​లో ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు యువత అధ్యక్షుడు హర్ష.. వైసీపీ నేతల వేధింపులతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. గతంలో పొదలకూరుకు చెందిన నారాయణ చెట్టుకు ఉరివేసుకొని చనిపోయాడు. ఈ ఘటనలను నిరసిస్తూ.. తెలుగుదేశం చలో కావలి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. నెల్లూరు జిల్లా కావలిలో జరుగుతున్న చలో కావలి కార్యక్రమాన్ని హాజరవుతున్న సీపీఎం, సీపీఐ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కావలి నియోజకవర్గ ఇన్​ఛార్జ్​ మాలేపాటి సుబ్బనాయుడును అరెస్ట్ చేసి జలదంకి స్టేషన్​కి తరలించారు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 10, 2023, 8:07 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.