కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న దృష్ట్యా గుంటూరు జిల్లా మాచర్లలో పూర్తి స్థాయి లాక్డౌన్ విధించనున్నట్లు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆదివారం అధికారులతో సమావేశమయ్యారు. అధికారుల సూచనల మేరకు సోమవారం నుంచి బుధవారం వరకు లాక్డౌన్ విధించాలని నిర్ణయించడం జరిగిందని ఆయన తెలిపారు. గురువారం నుంచి ఆదివారం వరకు పాక్షికంగా ఉంటుందని చెప్పారు. ఈ నాలుగు రోజుల్లో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు లాక్డౌన్ సడలింపు ఉంటుందన్నారు. కరోనా కేసులు తగ్గే ఈ విధానాన్ని అమలుపరచాలని ఉన్నతాధికారులకు సూచించారు.
ఇదీ చదవండి :