లాక్‌డౌన్‌తో రాష్ట్రంలో నేరాలు గణనీయంగా తగ్గాయి. ఇళ్ల నుంచి బయటకు వచ్చే అవకాశం లేకపోవటంతో ఘర్షణలకు, హత్యలకు చాలా వరకు అడ్డుకట్ట పడింది. రోడ్లపై వాహనాలు, మనుషుల రాకపోకలు నిలిచిపోవటంతో రోడ్డు ప్రమాదాలు, ప్రమాద మరణాలు బాగా తగ్గాయి. అంతా ఇళ్లలోనే ఉంటుండటంతో దొంగతనాలకు ఆస్కారం లేకుండా పోయింది. రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న దొంగతనాల్లో అత్యధిక శాతం మద్యం దుకాణాల్లో జరిగినవే. మద్యం అందుబాటులో లేకపోవటంతో.. ఆ మత్తులో జరిగే అనేక నేరాలకూ అడ్డుకట్ట పడింది. గతేడాది మార్చి 22 నుంచి ఏప్రిల్ 10 మధ్య రాష్ట్రవ్యాప్తంగా జరిగిన నేరాలతో పోల్చితే ఈ ఏడాది అదే కాలవ్యవధిలో జరిగిన వివిధ రకాల నేరాలు గణనీయంగా తగ్గాయి.
నేరం | 2019 | 2020 |
హత్యలు | 43 | 20 |
హత్యయత్నాలు | 70 | 26 |
దాడులు | 58 | 4 |
ఇతర దొంగతనాలు | 25 | 0 |
ఇతర కొల్లగొట్టడాలు(రాత్రిపూట) | 120 | 16 |
అత్యాచారాలు | 44 | 12 |
మరణాలు సంభవించిన రోడ్డు ప్రమాదాలు | 403 | 120 |
మరణాలు సంభవించని రోడ్డు ప్రమాదాలు | 667 | 159 |
- మరణాలు సంభవించిన రోడ్డు ప్రమాదాలు 70%, మరణాలు చోటుచేసుకొని రోడ్డు ప్రమాదాలు 76% తగ్గాయి.
- హత్యలు53%, హత్యయత్నాలు 62% తగ్గుముఖం పట్టాయి.
- సాధారణంగా వేసవిలో దొంగతనాలు అధికం. లాకడౌన్తో గత 19 రోజుల్లో కేవలం 16 చోటుచేసుకున్నాయి.
ఇదీ చదవండి:
పొరుగు రాష్ట్రాల్లో లారీ కార్మికుల అవస్థలు