గుంటూరు జిల్లా గురజాలలోని మూడో గ్రామ సచివాలయానికి తాళాలు వేశారు. రెండు నెలల నుంచి సచివాలయ భవనానికి అద్దె చెల్లించనందుకే ఇలా చేసినట్లు.. భవన యజమాని తెలిపారు. కార్యాలయానికి తాళం వేయటంతో.. సిబ్బంది 11 గంటల నుంచి బయటే ఉన్నారు. విషయం తెలుసుకున్న అధికారులు అక్కడకు చేరుకుని భవన యజమానితో మాట్లాడారు. రెండు, మూడు నెలల్లో మొత్తం బకాయిలను చెల్లిస్తామని అధికారులు యజమానితో ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం గేటు తాళాలు తీయటంతో.. సచివాలయ సిబ్బంది తమ విధులను నిర్వర్తించారు.
ఇదీ చదవండి: