రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న రేషన్ సరకులు తమకు అందడం లేదని గుంటూరు నగరం కొరిటీపాడు వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉండే ఇద్దరికి కరోనా పాజిటివ్ నమోదు కాగా.. అధికారులు ఆ ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించారు. ఫలితంగా ఇక్కడ ఉండే స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న రెండో విడత రేషన్ సరకులు తమకు అందడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ దుకాణాల వద్దకు వెళితే అధికారులు వాలంటీర్లతో సరఫరా చేయిస్తామని చెప్పినప్పటికీ...వాలంటీర్లు బయటకు రావడానికి భయపడుతున్నారని అన్నారు. దీంతో సరకుల పంపిణీకి అవాంతరాలు ఎదురవుతున్నాయని వాపోయారు. ప్రభుత్వం స్పందించి తమకు సరకులు పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీచదవండి.