ETV Bharat / state

సిబ్బంది దందా: ప్రభుత్వ దుకాణాల నుంచి నల్ల బజారుకు మద్యం

author img

By

Published : Jul 5, 2020, 3:09 PM IST

ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి నల్లబజారుకు మద్యం ఇబ్బడిముబ్బడిగా తరలుతోంది. సెబ్‌ అధికారులు, పోలీసులు పట్టుకున్న అనేక కేసుల్లో ఆయా దుకాణాల సిబ్బంది పాత్ర ఉన్నట్లు తేలుతోంది. వారిపై కేసులు నమోదు చేస్తున్న అధికారులు, ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారు. కొత్త మద్యం విధానం వచ్చాక గుంటూరు జిల్లాలో 353 దుకాణాలకు ఉద్యోగుల నియామకాలు జరిగాయి. తొలి రోజుల్లో కొంత పక్కాగా సాగిన వ్యాపారం తర్వాత పట్టాలు తప్పింది. సిబ్బంది పరిచయస్తులు, స్థానిక నాయకులు, దళారుల ప్రమేయంతో విధానం గాడి తప్పింది.

liquor goes to black market from government shops staff playing key role in this issue in guntur district
ప్రభుత్వ దుకాణాల నుంచి నల్లబజారుకు మద్యం.

లాక్‌డౌన్‌ సమయంలో 2 నెలలు మద్యం దుకాణాలు మూసివేసిన అధికారులు.. తిరిగి వాటిని తెరిచే ముందు సరకు నిల్వలు తనిఖీ చేశారు. జిల్లాలోని తెనాలి, మాచర్ల, నగరం, నరసరావుపేట తదితర స్టేషన్ల పరిధిలోని 21 దుకాణాల నుంచి రూ.50 వేల చొప్పున.. కొన్ని దుకాణాల్లో అయితే అంతకుమించి మద్యం మాయమైనట్లు గుర్తించారు. మరో 20 పైగా దుకాణాల్లో చిన్న మొత్తాల్లో మద్యం తరలిపోయినట్లు తేల్చారు. దీనికి దుకాణ పర్యవేక్షకులను బాధ్యులను చేసిన అధికారులు, వారి నుంచి సంబంధిత మొత్తాలను రికవరీ చేశారు.

ఇదంతా ఎలా జరిగింది?

ప్రభుత్వ దుకాణాల నుంచే మద్యం మాయమవడానికి కారణాలపై నేటికీ సమగ్ర సమీక్ష జరగకపోవడం అనేక సందేహాలకు తావిస్తోంది. పలు దుకాణాల్లో ఖరీదైన మద్యం, ఫుల్‌ బాటిల్స్‌ తదితరాలను వచ్చినవి వచ్చినట్లే దాచేసి విడిగా అమ్ముతున్నారని, అధిక ధర తీసుకుంటున్నారంటూ గొడవలు జరిగాయి. అంతేకాకుండా నిబంధనల మేరకు ఒకరికి 3 సీసాలే ఇవ్వాల్సి ఉండగా, కేసుల కొద్దీ బయటకు తరలడం మొదలైంది. ఈ క్రమంలో అధికారులు జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 44 మంది సిబ్బందిని అరెస్ట్‌ చేసి, విధుల నుంచి తొలగించారు.

రాత్రి 7 తర్వాత విక్రయాలు

ప్రభుత్వ మద్యం దుకాణాలు రాత్రి 7 గంటలకు మూసి వేస్తున్నారు. సిబ్బంది ద్వారా, ఇతర మార్గాల్లో వెలుపలికి వచ్చిన మద్యం ఆ తర్వాత నల్లబజారులో విచ్చలవిడిగా దొరుకుతోంది. గతంలో రూ.100 ధర ఉండే మద్యాన్ని ప్రభుత్వం రూ.200 చేస్తే, నల్లబజారులో రూ.350కు పైగా పలుకుతోంది. ఫలితంగా మద్యానికి అలవాటుపడిన పేద, మధ్య తరగతి వర్గాలు దోపిడీకి గురవుతున్నారు.

మాఫియాగా రూపొందుతోందా!

మొత్తం మీద ప్రభుత్వ మద్యం అమ్మకాల విధానంలో అనేక లోపాలు కొనసాగుతున్నాయి. దాదాపు 90 శాతం దుకాణాల్లో నిఘా నేత్రాలు లేకపోవడం, అధికారుల పర్యవేక్షణ లోపం, కనీసం ఎమ్మార్పీ ధరలను తెలిపే బోర్డులు కానరాకపోవడం విడ్డూరం. అధికారులు తగిన ప్రణాళికను రూపొందించకపోతే రానున్న రోజల్లో ఇదంతా ఒక మాఫియాగా రూపాంతరం చెందుతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్న మాట.. ప్రజల నుంచి వినిపిస్తోంది.

కఠిన చర్యలు తీసుకుంటున్నాం

'ప్రభుత్వ మద్యం దుకాణాల్లోని సిబ్బందిపై అనేకచోట్ల ఆరోపణలు రావడం వాస్తవమే. నిబంధనలు ఉల్లంఘించి మద్యాన్ని బయటకు తరలించడం, అధిక ధరలకు అమ్మడం తదితర కారణాలతో పలువురిని విధుల నుంచి తొలగించాం. లాక్‌డౌన్‌ సమయంలో మద్యం మాయమైన దుకాణాల్లోని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిపోలకు రాశాం. సిబ్బంది నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. చట్టపర చర్యలతో పాటు ఉద్యోగం నుంచి తొలగిస్తాం. అనేక దుకాణాలపై మా అధికారులు నిఘా పెట్టారు. దళారులను గుర్తించే పనిలో ఉన్నాం. నిఘానేత్రాలపై డిపోల వారితో మాట్లాడతాం.' -డాక్టర్‌ శ్రీనివాస్‌, సహాయ కమిషనర్‌, సెబ్‌, గుంటూరు

-

ఇవీ చదవండి:

కరోనా‌ టీకా ఈ ఏడాది సాధ్యం కాదు: సీసీఎంబీ డైరెక్టర్‌

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.