రాజధానిగా అమరావతినే కొనసాగించాలని... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. విశాఖకు పరిపాలనా రాజధాని మార్చడం సరైన నిర్ణయం కాదని... మొండి వైఖరిని విడనాడి ప్రజాభీష్టానికి అనుగుణంగా నడుచుకోవాలంటూ ముఖ్యమంత్రి జగన్కు లేఖ రాశారు. రాజధాని మార్పు, మూడు రాజధానుల నిర్ణయంతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలూ ఇబ్బంది పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు.
రాజకీయ పార్టీలతోపాటు అనేక మంది నిపుణులు, న్యాయ సంస్థలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. అభివృద్ధి వికేంద్రీకరణకు భాజపా అనుకూలమని... అయితే పాలన వికేంద్రీకరణను మాత్రం అంగీకరించబోమని స్పష్టం చేశారు. జగన్ నేతృత్వంలోని ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని అన్నారు. అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాభివృద్ధి కుంటుపడటం సహా అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రంపై ఆర్థికభారం పడనుందని హెచ్చరించారు.
ఇదీచదవండి