ETV Bharat / state

తెనాలిలో.. తగ్గిన నిమ్మ ధర - తెనాలిలో తగ్గిన నిమ్మ ధర వార్తలు

ఉత్తరాదిన నిమ్మకాయలకు డిమాండ్ లేని కారణంగా..వాటి ధర తగ్గుతోంది. గుంటూరు జిల్లాలో ప్రస్తుతం కొన్ని మార్కెట్లలో ధర బాగానే ఉన్నా.. కరోనా వల్ల రైతులు యార్డులకు తరలించలేకపోతున్నారు. ఫలితంగా వారు తీవ్రంగా నష్టపోతున్నారు. సీజన్ ఉన్నప్పుడు నిమ్మను అమ్మలేక నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

lemon plants
నిమ్మ
author img

By

Published : May 9, 2021, 5:44 PM IST

ఎండలు మండిస్తున్నా నిమ్మకు గిరాకీ లేకుండా పోయింది. ధర తగ్గుతూ రావడంతో రైతులకు లాభాలు చేతికి అందడం లేదు. గుంటూరు జిల్లాలో సుమారు 2600 హెక్టార్లలో 5,500 మంది రైతులు ఈ పంటను సాగు చేశారు. ఇందులో తెనాలి డివిజన్‌ వాటాయే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడే సుమారు 2 వేల హెక్టార్లలో 4 వేలకు పైగా రైతులు ఈ పంటను సాగు చేయడం విశేషం. మొత్తం పంటలో సుమారు 20 శాతం కంటే తక్కువగానే మన ప్రాంతంలో వినియోగం అవుతుంది. మిగిలినదంతా లారీల ద్వారా ఉత్తరాదికి వెళుతుంది. అంటే ఎగుమతులే ఈ పంటకు ఆధారం. అయితే గత నెలన్నర రోజులుగా కొవిడ్‌ రెండో దశ తీవ్రం కావడంతో మార్కెటింగ్‌కు ఆటంకాలు ఏర్పడడం మొదలైంది.

ఏప్రిల్‌ మొదటి వారంలో తెనాలి మార్కెట్‌యార్డులో కిలో నిమ్మకాయలు అత్యధికంగా రూ.110, అత్యల్పంగా రూ.80 చొప్పున ధర పలికాయి. తర్వాత ఈ ఇవి క్రమంగా తగ్గుతూ వచ్చాయి. మే తొలి వారంలో అదే యార్డులో కిలో నిమ్మకాయలు అత్యధికంగా రూ.40, అత్యల్పంగా రూ.15 చొప్పున విక్రయమయ్యాయి. సగం కంటే ఎక్కువగానే ధర తగ్గిపోయిందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఉత్తరాదిలోనూ పాక్షిక లాక్‌డౌన్‌ అమలవుతుండడంతో అక్కడ డిమాండ్‌ తగ్గింది.

మరోవంక యార్డులో ఒక వ్యాపారి కొవిడ్‌తో మృతిచెందడం, మరి కొందరు అదే సమస్యతో చికిత్సకు వెళ్లడంతో మిగిలిన వ్యాపారులు భయపడ్డారు. ఫలితంగా యార్డులో పలుమార్లు క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. మంచి సీజన్‌, ధర ఉన్నప్పుడు ఇలా జరగడంతో రైతులకు లాభాలు చేతికందకుండా పోయాయి. ప్రస్తుతం ఉన్న ధర కొంత మేరకు గిట్టుబాటు అవుతున్నా, ఈ ఏడాది మంచి లాభాలు వస్తాయనుకుంటే కొవిడ్‌ మరోమారు తమను దెబ్బకొట్టిందని సంగంజాగర్లమూడి గ్రామానికి చెందిన ఓ రైతు వాపోయారు.

ప్రస్తుతం మార్కెట్‌ యార్డులో వారానికి రెండు రోజులు మాత్రమే క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. గతంలో వారం మొత్తం మీద సుమారు 24 లారీలు (ఒక్కో లారీలో 20 టన్నులు) నిమ్మకాయలతో ఉత్తరాదికి వెళ్లేవి. ఇప్పడు క్రయ విక్రయాలు జరుగుతున్న రెండు రోజుల్లోనే వారం రోజుల సరకు వెళుతోంది. అంటే యార్డు ఉన్న సమయంలోనే అందుబాటులో ఉన్న నిమ్మకాయలను రైతులు యార్డుకు తెస్తున్నారు. సరైన సైజు రాకుండానే కాయలు కోస్తూ ఉండడంతో నాణ్యత పరంగానూ ధర రావడం లేదు. చెట్లకు కాయలను ఆపితే తిరిగి విక్రయాలు జరుగుతాయో లేదోనని ఆందోళనతో రైతులు ఇలా చేయాల్సి వస్తోంది. యార్డులో పలువురు వ్యాపారులు నిమ్మ రైతులకు పెట్టుబడులు పెట్టి ఉన్నారు. వాటిని తిరిగి రాబట్టుకోవడానికి వారు వారంలో రెండు రోజులైనా యార్డుకు వస్తున్నారు. లేకుంటే ఈ మాత్రం ఉండేది కాదని ఒక రైతు వివరించారు.

గత ఏడాదితో పోల్చితే మెరుగే

నిమ్మ పంటకు ధర తగ్గిన మాట వాస్తవమే. ఉత్తరాదిన డిమాండ్‌ తగ్గడం, యార్డులోని వ్యాపారుల్లో కొంతమంది అనారోగ్యానికి గురికావడంతో క్రయవిక్రయాలు సరిగా జరగకపోవడమే ఇందుకు కారణాలు. ప్రస్తుత ధర రైతులకు నష్టదాయకమేమీ కాదు. అయితే లాభాలు తగ్గుతున్నాయి. గత ఏడాది ఇదే సమయంలో అసలు ఎగుమతులే లేవు. ఈమారు ఫర్వాలేదు. వానలు పడడం మొదలైతే ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.

- జేవీ సుబ్బారావు, తెనాలి మార్కెట్‌ యార్డు కార్యదర్శి

ఇదీ చూడండి:

ఇంటివద్దకే రేషన్‌: వాహనాలను తిరిగిచ్చేసిన 10మంది ఆపరేటర్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.