ETV Bharat / state

కరోనా మృతుల అంత్యక్రియలను అడ్డుకోవడం చట్టరీత్యా నేరం: న్యాయ సేవాధికార సంస్థ

author img

By

Published : Aug 3, 2020, 1:16 AM IST

కరోనాతో మృతిచెందిన వారి అంతిమ సంస్కారాలను అడ్డుకోవడం చట్టరీత్యా నేరమని గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ గోపీనాథ్ తెలిపారు. జిల్లాలో ఎవరైనా అలా చేస్తే 94409 01048 నెంబరును సంప్రదించవచ్చని చెప్పారు.

Legal Services Authority clarifies that stopped last rituals of corona dead persons is a crime
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ

కరోనాతో మరణించిన వారి అంతిమ సంస్కారాలను చాలాచోట్ల ప్రజలు అడ్డుకుంటున్నారు. వారి నుంచి తమకు ఎక్కడ వైరస్ సోకుతుందేమోనన్న భయంతో దహన క్రియలను చేయనివ్వడంలేదు. మృతదేహాలలో వైరస్ 6 గంటలకు మించి ఉండదని చెప్తున్నా.. జనం మారడంలేదు.

అయితే ఆ విధంగా అంతిమ సంస్కారాలను అడ్డుకోవడం చట్టరీత్యా నేరమని గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ జీ. గోపినాథ్ తెలిపారు. అలా చేస్తే ఇండియన్ నేషనల్ పీనల్ కోడ్ సెక్షన్ 297, 341, 147, 148 కింద నేరస్తులుగా పరిగణిస్తారని పేర్కొన్నారు. జిల్లాలో ఎవరైనా దహన క్రియలను అడ్డుకుంటే 94409 01048 నెంబరును సంప్రదించవచ్చని చెప్పారు.

ఇవీ చదవండి...

మత్తులో మద్యం తరలిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు..!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.