కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్నదాతలు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా గుంటూరులో వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు స్థానిక బి.ఎస్.ఎన్.ఎల్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. ప్రభుత్వం వెంటనే నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పిన ప్రధాని మోడీ అన్నదాతల నడ్డి విరుస్తున్నారని ఆరోపించారు. ఈ చట్టాలను ఆహార ఉత్పత్తులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది తప్ప... రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదని విమర్శించారు.
ఇదీ చదవండీ...