గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో పోలీసులు ముందస్తుగా వివిధ పార్టీ నాయకులను, కార్యకర్తలను హౌస్ అరెస్ట్ చేశారు. పల్నాడు ప్రాంతంలోని గురజాలను జిల్లా కేంద్రం చేయాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వ వైఖరిపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందుగా గృహనిర్బంధం చేశారు. ఎటువంటి అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి..