ETV Bharat / state

సాంకేతికతతో కూడిన న్యాయవిద్యను అందించాలి: జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ - guntur district latest news

నేటితరం విద్యార్థులకు టెక్నాలజీతో కూడిన న్యాయవిద్యను అందించాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ అన్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో బీఏ ఎల్‌ఎల్‌బీ, బీబీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సుల తరగతులను ఆన్‌లైన్‌ వేదికగా ప్రారంభించారు.

justice chalameswar
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ చలమేశ్వర్‌
author img

By

Published : May 7, 2021, 10:07 PM IST

సమాజంలో వచ్చే విప్లవాత్మకమైన మార్పులకు అనుగుణంగా నేటి విద్యార్థులకు టెక్నాలజీతో కూడిన న్యాయవిద్యను అందించాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ అన్నారు. సైబర్‌ సెక్యూరిటీ, డిజిటల్‌ క్రైమ్స్‌ వంటి అత్యాధునిక సాంకేతికత సహాయంతో ఇంటిగ్రేటింగ్‌ న్యాయ విద్యను అభ్యసించిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని పేర్కొన్నారు. 7–8 ఏళ్లుగా న్యాయశాస్త్రం అభ్యసించిన వారికి విపరీతమైన డిమాండ్‌ ఉందన్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో బీఏ ఎల్‌ఎల్‌బీ, బీబీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సుల తరగతులను ఆన్‌లైన్‌లో ప్రారంభించారు.

అనేక రంగాల్లో ప్రయివేటీకరణ దిశగా అడుగులు పడుతున్న తరుణంలో.. ప్రతీ ఒక్క కంపెనీ వారికి సంబంధించిన క్లైంట్లతో అగ్రిమెంట్లు, చట్టాలు చేసుకుంటున్నాయని విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల ఛైర్మన్ డాక్టర్‌ లావు రత్తయ్య పేర్కొన్నారు. న్యాయశాస్త్రమంటే కోర్టులో వాదన చేసేవారు మాత్రమే కాదని.. ప్రతీ పరిశ్రమ, కంపెనీల్లో లీగల్‌ డిపార్ట్‌మెంట్‌ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

సుప్రీం కోర్టు, హైకోర్టులలో పనిచేసే లీడింగ్‌ ప్రాక్టీసింగ్‌ అడ్వకేట్స్‌ వారితో 50శాతం తరగతులను నిర్వహిస్తామని వర్సిటీ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కె.రామ్మూర్తి నాయుడు అన్నారు. మొదటి సంవత్సరంలోనే విద్యార్థులను ఇంటర్న్‌షిప్స్‌కు పంపిస్తామని తెలిపారు.

ఇదీ చదవండి: 'జగన్ సమీక్షలు చేస్తుంటే.. చంద్రబాబు పక్క రాష్ట్రంలో ఉండి విమర్శిస్తున్నారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.