ETV Bharat / state

స్థలం కావాలంటే రూ.15 వేలు ఇవ్వాల్సిందే.. అక్రమ వసూళ్లు!

రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. నరసరావుపేట పట్టణంలో అర్హులైన వారందరికీ ఉచితంగా సెంటు స్థలం చొప్పున ఇచ్చేందుకు అధికారులు భూములు సేకరించి ప్లాట్లుగా మార్చారు. జులై 8వ తేదీన ఇంటి స్థలాల పట్టాలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో ఆయా వార్డుల్లో ఉండే అధికార పార్టీ నాయకులు అక్రమాలకు తెరతీశారు.

author img

By

Published : Jul 6, 2020, 9:13 AM IST

land
land

వార్డుల్లో పెత్తనం చేసే నేతలు సచివాలయాల నుంచి అర్హుల జాబితా సేకరించారు. వార్డు వాలంటీర్లను పిలిపించుకుని లబ్ధిదారుల దగ్గర డబ్బులు వసూలు చేయాలని హుకుం జారీ చేశారు. అదేమని వాలంటీర్లు ప్రశ్నిస్తే మాకు ఎదురు చెపితే మీ ఉద్యోగాలు ఉండవని బెదిరిస్తున్నారు. ఇళ్ల పట్టాలు కావాలంటే రూ.15 వేలు ముడుపులివ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. పట్టణ పరిధిలో ఇళ్ల స్థలాలకు 10 వేలకు పైగా దరఖాస్తులు అందాయి. పరిశీలన పూర్తికాగా అధికారులు 8036 మందిని అర్హులుగా గుర్తించారు. ఇందులో 1504 మందికి టిడ్కో గృహసముదాయంలో ఇళ్లు కేటాయించారు. మిగతా వారికి స్థలాలు ఇచ్చేందుకు మూడు చోట్ల భూములు సేకరించి ప్లాట్లుగా మార్చారు. వార్డుల వారీగా అర్హుల జాబితాలు తయారు చేశారు. ఎలాంటి చెల్లింపులు లేకుండా ఒక్కో లబ్ధిదారుకి సెంటు చొప్పున ఇచ్చేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పట్టాల పంపిణీ కార్యక్రమం దగ్గర పడతుండటంతో వార్డు స్థాయి నేతలు అక్రమ వసూళ్లపై కన్నేశారు. వాలంటీర్లను భయపెట్టి గుట్టు చప్పుడు కాకుండా తమ పని చక్కబెట్టుకునేందుకు పావులు కదుపుతున్నారు. పట్టణంలో 34 వార్డులుండగా ఎక్కువ శాతం వార్డుల్లో ఇదేతంతు నడుస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పురపాలక సంఘ కార్యాలయం సమీపంలోని ఓ వార్డులో అధికార పార్టీ నేతలు వాలంటీర్లకు ప్రైవేటు మీటింగ్‌ పెట్టి ముడుపులు వసూలు చేయాలని ఒత్తిడితేగా వారు ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.

126 ఎకరాల్లో ప్లాట్లు

పట్టణ పరిధిలో పేదలకు ఇంటి స్థలాలు పంపిణీ చేసేందుకు 126 ఎకరాల్లో ప్లాట్లు వేశారు. పట్టణ పరిధిలో 6532 మంది లబ్ధిదారులకు ఇంటి స్థల పట్టాలు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. పురపాలక సంఘానికి చెందిన టిడ్కో గృహ సముదాయం పక్కనే ఉన్న 12 ఎకరాలు, లింగంగుంట్ల పంపు బావి దగ్గర 14 ఎకరాలను ప్లాట్లుగా మార్చారు. ఉప్పలపాడు సమీపంలో ప్రైవేటు వ్యక్తుల నుంచి 100 ఎకరాలు కొనుగోలు చేశారు. 126 ఎకరాల భూముల్లో 6532 మందికి ఇంటి స్థలం ఇచ్చేందుకు పట్టాలు సిద్ధం చేశారు. పట్టణ పరిధిలో ఎక్కువ శాతం వార్డుల్లో అధికార పార్టీ నేతల కనుసన్నల్లో లబ్ధిదారుల జాబితాలు రూపొందాయి. అర్హత ఉన్నా వారు అధికార పార్టీకి చెందిన వారు కాకుంటే జాబితాలో పేర్లు తొలగించారు. తమ పేర్లు లబ్ధిదారుల జాబితాలో లేవని పలు వార్డులకు చెందిన పేదలు మున్సిపల్‌ కార్యాలయానికి వచ్చి అధికారుల దృష్టికి తెచ్చినా పట్టించుకున్న దాఖలాలు లేవు. తాజాగా కొందరు నాయకులు వాలంటీర్ల ద్వారా అనధికార వసూళ్లకు పాల్పడుతున్నా అధికారులు తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు.

ఎవరికీ నగదు చెల్లించవద్దు

ప్రభుత్వం అర్హులైన వారందరికీ ఉచితంగా ఇంటి స్థల పట్టాలు అందజేస్తుంది. ఎవరికీ ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఎవరైనా డబ్బులు అడిగితే తమ దృష్టికి తెస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. వాలంటీర్లు డబ్బులు అడిగినట్లు తేలితే వారిపైనా చర్యలు తప్పవు. - వెంకటేశ్వర్లు, ఆర్డీవో

ఇదీ చదవండి: రేపు కడప జిల్లాకు ముఖ్యమంత్రి జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.