ETV Bharat / state

తెనాలిలో పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపన - తెనాలి తాజావార్తలు

గుంటూరు జిల్లా తెనాలిలో ఐదు పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తెలిపారు. పట్టణంలోని యడ్లలింగయ్య కాలనీ, చంద్రబాబు నాయుడు కాలనీ, పాత ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా నిర్మించనున్న ఆరోగ్య కేంద్రాల శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

health center
పట్టణ ఆరోగ్య కేంద్రాలకు శంకుస్థాపన
author img

By

Published : May 25, 2021, 12:13 PM IST

గుంటూరు జిల్లా తెనాలిలోని పేద ప్రజలకు వైద్యాన్ని మరింత చేరువ చేసేందుకు ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తెలిపారు. తండ్రిని స్ఫూర్తిగా తీసుకుని సీఎం జగన్​… పేదలకు విద్యా, వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నారని ఆయన అన్నారు. కొవిడ్​ను ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చి బాధితులకు సాయం అందేలా చేశారని తెలిపారు. పట్టణంలోని యడ్లలింగయ్య కాలనీ, చంద్రబాబు నాయుడు కాలనీ, పాత ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా నిర్మించనున్న ఆరోగ్య కేంద్రాల శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో నెలకొన్న చిన్న చిన్న లోపాలను సరి చేయించి బాధితులకు చికిత్స అందేలా ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులు సూచించారు. పట్టణంలోని ఏడు, ఎనిమిది వార్డుల్లోని సచివాలయాలను పరిశీలించిన ఆయన… ఆయా ప్రాంతాల్లోని వ్యర్థాలను తొలగించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పురపాలక ఛైర్​పర్సన్​ సయ్యద్ ఖాలేదా నసీమ్, వైస్​ ఛైర్మన్​ హరిప్రసాద్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 'కరోనా మరణాలపై ప్రభుత్వం అవాస్తవాలు ప్రచారం చేస్తోంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.