గుంటూరు జిల్లా పెదకాకాని పోలీస్ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఫాతిమాపై ఆమె తల్లిదండ్రులు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఆస్తి కోసం తమని వేధిస్తోందని ఫాతిమా తండ్రి ఖాసిం సైదా వాపోయారు. సైదా మొదటి భార్యకు పిల్లలు లేకపోవటంతో రెండో వివాహం చేసుకున్నారు. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు. రెండో భార్య మరణించింది. ఆమె పిల్లలిద్దరికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. వృద్ధాప్యం కారణంగా సేద్యం చేసే పరిస్థితి లేకపోవటంతో తనకున్న ఎకరంన్నర పొలాన్ని ఖాసిం వేరే వాళ్లకు విక్రయించాడు.
అయితే పొలం అమ్మేందుకు వీల్లేదని... అది తన పేర రాయాలని కుమార్తె ఫాతిమాతో పాటు ఆమె భర్త ఒత్తడి తెస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. ఆస్తిఇవ్వకపోతే పురుగులమందు తాగా చనిపోమని సీసా ఇచ్చిందని ఆమె పినతల్లి మస్తాన్ భీ ఆవేదన వ్యక్తం చేసింది. సైదా తన మొదటి భార్యతో కలిసి గుంటూరు గ్రామీణ ఎస్పీ కార్యాలయానికి వచ్చి అక్కడ ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు.
ఇదీ చూడండి