ETV Bharat / state

Lack of facilities in Hospitals ఏ ప్రభుత్వ ఆసుపత్రి చూసినా.. ఇదే పరిస్థితి! యంత్రపరికరాలు లేక.. నిలచిన శస్త్రచికిత్సలు!

author img

By

Published : May 21, 2023, 4:22 PM IST

Lack of facilities in Hospitals: ప్రభుత్వాసుపత్రుల అభివృద్ధిపై ముఖ్యమంత్రి జగన్‌ తరచూ చేసే ఆర్భాట ప్రకటనలు.. పేద రోగులకు సాంత్వన చేకూర్చడం లేదు. వైద్యులు, పారామెడికల్‌ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని చెప్పే సీఎం.. ఆసుపత్రుల్లో సౌకర్యాలు సమకూర్చడంలో ఘోరంగా విఫలమవుతున్నారు. శస్త్రచికిత్సలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలకు అవసరమైన పరికరాలు, యంత్రాలు ఒకటి ఉంటే మరొకటి ఉండవు.. దీంతో ప్రభుత్వాసుపత్రుల్లో పేద రోగులకు కార్పొరేట్‌ వైద్యం కలగానే మిగులుతోంది.

ఆసుపత్రుల్లో వసతుల కొరత.. పేదలకు కలగానే కార్పొరేట్‌ వైద్యం
Lack of facilities in Hospitals

Lack of facilities in Hospitals: విశాఖలోని కేజీహెచ్, కాకినాడ, గుంటూరు, విజయవాడ బోధనాసుపత్రుల్లో గుండె శస్త్ర చికిత్సలు స్తంభించాయి. వైద్యుల నియామకాలకు తగ్గట్లు యంత్రాలు, పరికరాలు, కన్జుమబుల్స్‌ లేకపోవడంతో గుండె శస్త్ర చికిత్సలు, వాల్వ్‌ రీప్లేస్‌మెంట్‌ చేయాల్సిన కార్డియో థొరాసిక్‌ సర్జన్లు వాటి జోలికి వెళ్లడం లేదు. దీంతో రోగులు ప్రైవేట్‌ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందిస్తే ప్రభుత్వాసుపత్రులకు కూడా ఫీజుల రూపంలో నిధులు సమకూరతాయి. ఈ దిశగా పట్టించుకొనే వారు కరవయ్యారు. బోధనాసుపత్రుల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షల అనంతరం బైపాస్‌ సర్జరీ, వాల్వ్‌ రీప్లేస్‌మెంట్‌ చేయించుకోవాలని వైద్యులు చెప్పిన తరువాత రోగులు ప్రైవేట్‌ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు.

విశాఖలోని.. కేజీహెచ్‌లో ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ హోదాల్లో ముగ్గురు వైద్యులు పని చేస్తున్నారు. కేజీహెచ్‌లో గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స విభాగం చాలా కాలం నుంచి నడుస్తోంది. గుండెకు సంబంధించిన బైపాస్‌ సర్జరీలు, వాల్వ్‌ రీప్లేస్‌మెంట్‌ చికిత్సలు ఈ విభాగంలో చేయాలి. ఇవి చేయాలంటే.. టెంపరేచర్‌ కంట్రోల్‌ మిషన్, హార్ట్‌ లంగ్‌ మిషన్‌ ఉండాలి. ఇవి రెండు, మూడు నెలల నుంచి పని చేయడం లేదు. వాటి స్థానంలో కొత్తవి సమకూర్చేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. సుమారు 30 మంది రోగులు బైపాస్‌ సర్జరీలు, వాల్వ్‌ రీప్లేస్‌మెంట్‌ కోసం ఎదురు చూస్తున్నారు. కేజీహెచ్‌లో రెండేళ్ల నుంచి ఎమ్మారై కూడా పని చేయడం లేదు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రజిని, జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున తరచూ కేజీహెచ్‌ను సందర్శిస్తుంటారు. కానీ.. రోగులకు మాత్రం అవస్థలు తప్పడం లేదు.

విజయవాడ.. జీజీహెచ్‌లో కార్డియో థొరాసిస్‌ సర్జన్లు ముగ్గురున్నారు. విభాగానికి ఇంఛార్జి హెచ్‌వోడీగా అసోసియేట్‌ ప్రొఫెసర్‌ వ్యవహరిస్తున్నారు. మరో ఇద్దరు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లున్నారు. శస్త్రచికిత్సల నిర్వహణకు అవసరమైన ఇంట్రా అరోటిక్‌ బెలూన్‌ పంప్, యాక్టివేటెడ్‌ క్లాటింగ్‌ మిషన్‌ కూడా ఉంది. ఇక్కడ ఓ ప్రైవేట్‌ ఆసుపత్రి యాజమాన్యం ఆధ్వర్యంలో జరిగిన ఒక్క శస్త్రచికిత్స తప్పితే ఇప్పటివరకు ఒక్క సర్జరీ కూడా జరగలేదు. మరోవైపు వాల్వ్‌ల పంపిణీ సంస్థతో ఇప్పటివరకు ప్రభుత్వపరంగా ఒప్పందం చేసుకోలేదు. అందుకోసం నిధుల కేటాయింపు జరిగితేనే తదుపరి చర్యలు ఉండనున్నాయి. బైపాస్‌ సర్జరీ చేయాలంటే... వాడిపారేసే కన్జుమబుల్స్, ఇతర సామగ్రి అవసరం. వీటిని భారీగా కొనుగోలు చేస్తేనే శస్త్రచికిత్సలు ఎక్కువ సంఖ్యలో జరుగుతాయి. ఈ పరిస్థితుల్లో ఇక్కడి కార్డియో థొరాసిక్‌ సర్జన్లు ఊపిరితిత్తుల సర్జరీలకే పరిమితం అవుతున్నారు.

గుంటూరు.. జీజీహెచ్‌లో రోగులకు బైపాస్‌ సర్జరీలు, వాల్వ్‌ రీప్లేస్‌మెంట్‌ చికిత్సలు తక్కువగా జరుగుతున్నాయి. ఇక్కడ అయిదుగురు కార్డియో థొరాసిక్‌ సర్జన్లు ఉన్నారు. ప్రముఖ కార్డియో థొరాసిస్‌ సర్జన్‌ డాక్టర్‌ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే జీజీహెచ్‌లో మళ్లీ గుండె శస్త్ర చికిత్సలు, గుండెమార్పిడి వైద్య సేవలు అందిచడానికి ముందుకొచ్చినా, ప్రభుత్వం నుంచి సహకారం కొరవడింది. థియేటర్లలోని కొన్ని పరికరాలు మరమ్మతులకు గురయ్యాయి. వాటిని పునరుద్ధరించి గుండె శస్త్ర చికిత్సల విభాగంలో అమర్చాలని ఈ ఏడాది జనవరిలో ఆసుపత్రిలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో డాక్టర్‌ గోఖలే జీజీహెచ్‌ ఉన్నతాధికారులను కోరారు. అన్ని సవ్యంగా జరిగి ఉంటే ఫిబ్రవరి రెండో తేదీ నుంచి జీజీహెచ్‌లో ఈ సేవలు పునఃప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు వార్డు సిద్ధం చేసి, శస్త్రచికిత్సల నిర్వహణకు వీలుగా అవసరమైన పరికరాలను అందుబాటులోకి తేలేదు. వార్డు, థియేటర్లు సిద్ధం చేయగానే సర్జికల్స్, ఔషధాలు సమకూర్చుతామని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.

కాకినాడ.. జీజీహెచ్‌లో ముగ్గురు కార్డియో థొరాసిక్‌ సర్జనులు ఉన్నారు. ఇక్కడ బైపాస్‌ సర్జరీ, వాల్వ్‌ రీప్లేస్‌మెంట్‌ చేయడానికి అవసరమైన మిషన్లు దశాబ్ద కాలం నాటివి అయినందున ప్రస్తుతం అవి పనిచేయడం లేదు. దీంతో వారు ఊపిరితిత్తుల శస్త్రచికిత్సలకు పరిమితమయ్యారు. పరికరాల కొనుగోలుకు ఇప్పుడు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.