విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తున్నట్లు కేంద్ర ప్రకటించడంపై రాజధాని గ్రామాల్లో మహిళలు, రైతులు రెండో రోజు నిరాహార దీక్షలు కొనసాగించారు. కృష్ణా జిల్లాకు చెందిన మహిళలు మందదడంలో 12 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టారు. వీరికి కృష్ణా జిల్లా మాజీ జడ్పీ చైర్ పర్సన్ గద్దె అనురాధ దండలు వేసి దీక్షలో కూర్చోపెట్టారు.
దీక్ష ముగిసిన అనంతరం మందడం మహిళలు పళ్ల రసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. పరిపాలనా రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ 420వ రోజు నిరసన దీక్షలు కొనసాగించారు. ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ గోవింద అయ్యాయంటూ.. మందడం మహిళలు వినూత్న రీతిలో నిరసనలు చేశారు.
ఇదీ చదవండి: