ETV Bharat / state

'కొప్పర్రులో తెదేపానే ప్రణాళిక ప్రకారం దాడి చేసింది' - గుంటూరు జిల్లా

కొప్పర్రు దాడి ఘటనను తెదేపానే ప్రణాళిక ప్రకారం చేసిందని వైకాపా మండల వైకాపా మండల కన్వీనర్​, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ మదమంచి వాసు ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో తెదేపా సమస్యలు సృష్టిస్తోందని అన్నారు.

వైకాపా
వైకాపా
author img

By

Published : Sep 21, 2021, 7:33 PM IST

ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో తెదేపా సమస్యలు సృష్టిస్తోందని గుంటూరు జిల్లా పెదనందిపాడు మండల వైకాపా మండల కన్వీనర్​, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ మదమంచి వాసు ఆరోపించారు. కొప్పర్రు దాడి ఘటనను తెదేపా ప్రణాళిక ప్రకారం జరిపిందని అన్నారు. తెదేపా నేతలు.. వైకాపా కార్యకర్తల్ని రెచ్చగొట్టారని తెలిపారు. తమ పార్టీ కార్యకర్తైన శ్రీకాంత్​ను ఓ ఇంట్లోకి లాక్కెళ్లి..తలుపులు వేసి తెదేపా వాళ్లు తీవ్రంగా కొట్టారని అన్నారు. తలుపులు ఎంతకీ తీయలేదని తెలిపారు. పోలీసులు అటువైపు నుంచి వచ్చి తలుపులు తీస్తే.. శ్రీకాంత్​ అపస్మారక స్థితిలో ఉన్నాడని వెల్లడించారు. వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించామని తెలిపారు.

కాగా శ్రీకాంత్​ చనిపోయాడని భావించి..ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి తెదేపా నేతలే ఆయా ప్రదేశాల్లో దాడులు చేసి..తమపై నెట్టారని అన్నారు. తెదేపా వాళ్లు చేసిన దాడిలో తమ కార్యకర్తలు 8 మంది గాయపడ్డారని తెలిపారు. అయినా పోలీసులు తమ కార్యకర్తల్నే అరెస్టు చేశారని ఆరోపించారు. తెదేపా నేతలు, కార్యకర్తలను ఇప్పటివరకూ పోలీసులు అరెస్ట్​ చేయలేదన్నారు.

ఇదీ చదవండి: ప్రతిపక్ష నేతల గొంతు నొక్కే చర్యలు సరికాదు: నిమ్మల రామానాయుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.