గుంటూరు జిల్లా బాపట్లలో ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నిశ్శబ్ధం సినిమా గురించి తెలియజేశారు. కోన ఫిలిం కార్పొరేషన్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించిన నిశ్శబ్ధం సినిమా గురించి మాట్లాడారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో... జనవరి 31న విడుదల చేస్తున్నామని తెలిపారు. సినిమాలో హీరోగా మాధవన్ ,హీరోయిన్ అంజలిని పోలీస్ ఆఫీసర్ , హీరోయిన్ అనుష్క మూగ,చెవిటి పాత్రలో సాక్షి పేరుతో కనిపించనుంది. అనుష్క, మాధవన్ ఇద్దరి మధ్య ప్రేమ కథ సాగుతుందని... సాక్షి పాత్ర పోషించిన అనుష్క చుట్టూ కథ నడుస్తుందనన్నారు. నూరుశాతం అమెరికాలో షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు చిత్రం ఇదేనని... ఈ సినిమా షూటింగ్ కు అమెరికా పోలీసులు పూర్తి సహకారాన్ని అందించారని కోన తెలిపారు. మనదేశంలో చిత్రం నిర్మించాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయని... ముఖ్యంగా లంచాలు ఇవ్వవలసి ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమెరికాలో నూరు శాతం షూటింగ్ చేసిన తొలి తెలుగు సినిమా ఇదే..! - హీరోయిన్ అంజలి తాజా సినిమా వార్తలు
ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి... నిశ్శబ్ధం సినిమా గురించి తెలియజేశారు. ఈ చిత్రం ప్రేక్షకులకు నచ్చేవిధంగా తీశామని... సినిమాను చూడాలని కోరారు.