గుంటూరు జిల్లా అమరావతిలో భారీ మోసం జరిగింది. ధరనికోటకు చెందిన వడ్లపూడి రమేష్ అనే వ్యక్తిని... పక్కింటి వ్యక్తే కిడ్నాప్ చేసి... మోసానికి పాల్పడ్డాడు.
ఇదీ జరిగింది
రమేష్ ఇంటి పక్కన చేకూరి వెంకటేశ్వరరావు నివాసం ఉంటున్నారు. రమేష్‌కు చెందిన భూమిని కౌలుకు తీసుకుంటానని వెంకటేశ్వరరావు నమ్మబలికాడు. దీంతో... రమేష్‌ను గ్రామ శివారుకు రమ్మన్నాడు. అలా వచ్చిన రమేష్‌ను కిడ్నాప్ చేశారు. ఘటన జరిగిన మరుసటి రోజు ఉదయం రమేష్ బాబుకు మావయ్య వరసయ్యే పెనుమచ్చు హనుమంతరావును కూడా కిడ్నాప్ చేశారు. ధరనికోటలో ఉన్న 10 కోట్లు విలువ చేసే 6.5 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ చేయాలని లేకపోతే హత్య చేస్తామని ఇరువురిని బెదిరించి...భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.అనంతరం ఇద్దరిని వదలి పెట్టాడు.ఈ వ్యవహారాన్ని ఎవరికైనా చెప్తే వారి పిల్లలను చంపేస్తానని బెదిరించారు.ఆస్తి పోయిందన్న బాధను తట్టుకోలేని... రమేష్, హనుమంతరావులు గుంటూరు రూరల్ ఎస్పీ విజయరావుని కలిసి న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు....నిందితులను అరెస్ట్ చేశారు. బాధితులకు న్యాయం చేయాలని తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డిని ఆదేశించారు.
ఇవీ చదవండి