ETV Bharat / state

తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా అంజనీకుమార్... సీఎం కేసీఆర్​ విషెస్

author img

By

Published : Dec 31, 2022, 8:36 PM IST

Anjani Kumar Take charge as New DGP : తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా అంజనీకుమార్​ బాధ్యతలు స్వీకరించారు. డీజీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఉన్నతాధికారులు హాజరై ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం అంజనీకుమార్​ సీఎం కేసీఆర్​ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Anjani Kumar Take charge as New DGP
తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా అంజనీకుమార్... సీఎం కేసీఆర్​ విషెస్

Anjani Kumar Take charge as New DGP : తెలంగాణ రాష్ట్ర డీజీపీగా అంజనీకుమార్​ బాధ్యతలు స్వీకరించారు. మహేందర్​రెడ్డి నుంచి బాధ్యతలు చేపట్టారు. డీజీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఉన్నతాధికారులు హాజరయ్యారు. మహేందర్​రెడ్డికి వీడ్కోలు పలికిన ఉన్నతాధికారులు.. కొత్త డీజీపీగా అంజనీకుమార్​కు స్వాగతం పలికారు. బిహార్ రాజధాని పాట్నాలో 1966 జనవరి 28న జన్మించిన అంజనీకుమార్.. పాట్నాతో పాటు దిల్లీలో విద్యాభ్యాసం పూర్తి చేశారు.

1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. పోలీస్ శాఖలో మంచి పోస్టింగులలో పని చేశారు. ఆయన పలు అవార్డులు సైతం దక్కించుకున్నారు. ఐక్యరాజ్య సమితి శాంతి మెడల్ రెండుసార్లు అందుకున్నారు. హైదరాబాద్ సిటీ పోలీసుల 500 ఏళ్ల చరిత్రపై రాసిన పుస్తకంలోనూ తన భాగస్వామ్యాన్ని అంజనీకుమార్ అందించారు. అంజనీకుమార్ 2026 జనవరిలో పదవీ విరమణ చేయనున్నారు.

సీఎంకు కృతజ్ఞతలు..: ఇదిలా ఉండగా.. బాధ్యతలు చేపట్టిన అనంతరం అంజనీకుమార్​ ముఖ్యమంత్రి కేసీఆర్​ను కలిశారు. ప్రగతిభవన్​లో సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన.. డీజీపీగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అంజనీకుమార్​కు సీఎం కేసీఆర్​ శుభాకాంక్షలు తెలిపారు.

రాచకొండ సీపీగా దేవేందర్​సింగ్​ చౌహాన్..: మరోవైపు రాచకొండ నూతన పోలీస్ కమిషనర్​గా దేవేందర్​సింగ్ చౌహాన్ బాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుతం ఉన్న సీపీ మహేశ్ భగవత్ ఆయనకు బాధ్యతలను అప్పగించారు. కమిషనరేట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి రాచకొండ పోలీస్ కమిషనర్​గా మహేశ్ భగవత్ సుధీర్ఘంగా పని చేశారు. ఆయనను ప్రభుత్వం ఇటీవల తెలంగాణ సీఐడీ డీజీగా బదిలీ చేసింది. దాంతో ఆయన స్థానంలో దేవేందర్​సింగ్​ సీపీగా బాధ్యతలు స్వీకరించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.