గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో కార్తీక మాసం తొలి సోమవారం ఆలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగాయి. పట్టణంలోని హరిహర క్షేత్రం, గంగా పార్వతి సమేత ఉమామహేశ్వర స్వామి దేవస్థానం, పసుమర్రు తాండవేశ్వరస్వామి, వేలూరు సోమేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారు జాము నుంచే ఉసిరి చెట్ల కింద దీపాలు వెలిగించి, గోపూజలు చేశారు. హరిహర క్షేత్రంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ఆవుపాలు, నెయ్యి, పెరుగు, తేనె, సుగంధ పరిమళ ద్రవ్యాలతో కన్నుల పండువగా అభిషేకాలు జరిపారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు కొవిండ్ నిబంధనలు పాటించేలా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఇవీ చూడండి...