ETV Bharat / state

మంగళగిరి 'స్వాతిముత్యం' మనసు ఎందుకు విరిగింది ? మరి జలగన్న కామన్​ మ్యాన్​కు నచ్చుతాడా ?! - disputes in mangalagiri ycp

Karakatta Kamalhasan: ఏం జరిగిందో ఏమో గానీ కరకట్ట కమల్​హాసన్​, మంగళగిరి మహానటుడు హర్ట్ అయ్యాడు. బుంగమూతి పెట్టలేదు గానీ 'నేను హర్ట్'​ అనడంతో ఎన్నికల వేళ ఏమిటీ రాజీ'డ్రామా' అంటూ నియోజకవర్గ ప్రజానీకం చర్చించుకుంటోంది.

karakatta_kamalhasan
karakatta_kamalhasan
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 11, 2023, 5:09 PM IST

Karakatta Kamalhasan : ఏమైందో ఏంటో! కరకట్ట కమల్​హాసన్​ ఉన్నట్టుండి పాత పల్లవితో కొత్త రాగం అందుకున్నాడు. 'అనుకున్నదొక్కటి, అయ్యింది ఒక్కటీ బోల్తా కొట్టిందిలే బుల్​బుల్​ పిట్ట' అనే పాట గుర్తొచ్చి సిగ్గుతో తలదించుకుని అడుగులో అడుగులు వేస్తున్నాడు. మంగళగిరి 'స్వాతిముత్యం' మనసు ఎందుకు విరిగింది? మా 'కనకాంబరం' వీరాభిమాని 'ఏకాంబరమే' ఇలా దిక్కుతోచని పరిస్థితిలో ఉంటే ఇక మా పరిస్థితి ఏంటి ? అని మిగతా నటీనటులంతా ఆందోళనకు గురవుతున్నారు. కరకట్ట కమల్​హాసన్​కు ఏమైందీ వేళ? ఇక పార్టీ పరిస్థితి, రాష్ట్రం భవిష్యత్​ ఏమిటి 'జలగన్నా'? క్లైమాక్స్​ ఎలా ఉండబోతోంది? సస్పెన్స్ నెలకొన్న తరుణంలో ప్రజలంతా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

3వేల కిమీ మైలు రాయిని అధిగమించిన యువగళం - పైలాన్ ఆవిష్కరణలో పాల్గొన్న బ్రాహ్మణి, మోక్షజ్ఞ, దేవాన్ష్​

ఆణిముత్యాల్లాంటి సన్ని'వేషాలు'

కరకట్ట కమల్​హాసన్ మరో ఘట్టానికి తెరతీసిన వేళ గతంలో ఆయన అత్యద్భుతంగా నటించి మెప్పించిన సన్ని'వేషాల్ని' నియోజకవర్గ ప్రజానీకం ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటోంది. రాజమౌళి ఆర్​ఆర్​ఆర్​ రికార్డులు కూడా చెరపలేకపోయినా ఆ సన్నివేశాలు, 'ఆస్కార్​ కూడా తక్కువే' అనిపించే ఆ నవరస నటనను మర్చిపోలేకపోలేక బెంగపెట్టుకుంటోంది. పది రూపాయలకే కూరగాయలు పంచిన ఆ దానకర్ణుడికి ఏమైందని కుమిలిపోతోంది. కలల రాజన్న క్యాంటీన్లు పెట్టి కడుపు నింపిన మా నాయకుడు ఎక్కడా అని పేద ప్రజానీకం కరకట్టపై గాలిస్తోంది. కొండల్ని పిండి చేసిన (మట్టి మాఫియా) మా బాహుబలికి ఏమైంది? అని రోదిస్తోంది. 'అన్న నడిచొస్తే మాస్, అన్న వరి నాట్లేస్తే మాస్, అన్న పచ్చ గడ్డి మోసుకొస్తుంటే మాస్' ఆణిముత్యాల్లాంటి ఆ సన్నివేశాలు ఏవీ? ఆ బాల గోపాలాన్ని అలరించిన ఆ నటసార్వభౌముడు కరకట్ట కమల్​హాసన్​​ ఎక్కడా? అని అణువణువూ గాలిస్తోంది.

కమల్​హాసన్​కే నచ్చలేదు కామన్​ మ్యాన్​కు నచ్చుతాడా?!

జలగన్న అంటే కమల్​హాసన్​కు పిచ్చి. గుండెల్లో కట్టుకున్న అన్న కోసం ఏదైనా చేస్తాడు. తన గుండెను తీసి ఇవ్వమన్నా ఇచ్చేస్తాడు. అంతటి వీరాభిమాని. మరి ఇప్పుడు ఆత్మ, శరీరం వేరయ్యిందే! పెద్ద కష్టమే వచ్చి పడిందే! కమల్​హాసన్​కే నచ్చని జలగన్న ఇక కామన్​ పీపుల్​కు ఏం నచ్చుతాడు?

అమరావతి రైతుల భారీ బహిరంగ సభ - హాజరుకానున్న చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌

ఎన్నికల ముందు మరో సినిమా?!

ఐదేళ్లు పూర్తయ్యాయి. ఓ వైపు మళ్లీ ఎన్నికల హడావిడి. మరోవైపు అమరావతి రైతుల ఆవేదన, ఆడపడుచుల ఆక్రందన ఇంకా చెవుల్లో మార్మోగుతోంది. అధికారం మత్తులో అడుగడుగున చేసిన అన్యాయం కళ్లకు స్పష్టంగా కనిపిస్తోంది. 'అమరావతి' పేరు వింటేనే వెయ్యి ఓల్టుల షాక్​ కొట్టినట్టుగా ఉంటోంది. ఏం చేయాలి? ఏ పాత్రలో ఇమిడిపోవాలి? జనాన్ని మరోసారి ఎలా మోసం చేయాలి? ఏ వేషం ధరించాలి? కరకట్ట కమల్​హాసన్​ను వేధిస్తున్న సందేహాలివి.

అన్ని వర్గాలకూ అన్యాయం

మంగళగిరి మహానటుడి హావభావాలు, అమాయకపు ఆస్కార్ నటనకు యువత మోసపోయింది. 'ప్రత్యేక హోదా నా ఊపిరి, ఉద్యోగాల విప్లవం' నినాదాలు వెనుక ఉద్దేశాన్ని నిరుద్యోగులు అంచనా వేయలేకపోయారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు నట విశ్వరూపం చూపించిన కరకట్ట కమల్​హాసన్ మరో​ రాజీ'డ్రామా'కు తెరలేపాడా?

రైతుల కష్టాలు చూడ్డానికి వెళ్లావా లేక క్రికెట్ చూడటానికి వెళ్లావా జగన్: సీపీఐ రామకృష్ణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.