పాఠశాలలు, ఆసుపత్రుల్లో అమలు చేసినట్టుగానే రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ యార్డుల్లోనూ నాడు - నేడు కార్యక్రమాన్ని అమలు చేయనున్నామని మంత్రి కన్నబాబు ప్రకటించారు. సీఎం జగన్ అధ్యక్షతన వ్యవసాయ మిషన్ సమావేశం ముగిసిన అనంతరం... ఆయన మీడియాతో మాట్లాడారు. మార్కెటింగ్ నిఘా పటిష్టం చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. డిసెంబర్ 15 వరకు కౌలు రైతుల వివరాలు సేకరించి వారికి రైతు భరోసా సొమ్ము అందచేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు 45 లక్షల కుటుంబాలు రైతు భరోసా ద్వారా లబ్ధి పొందినట్టు తెలిపారు. గతంలో ఏర్పాటైన జాయింట్ ఫార్మింగ్ సంఘాలు రైతుభరోసా పరిధిలోకి వస్తాయో రావో.. తేల్చాలని, అలాగే గిట్టుబాటు ధర తగ్గకుండా అమ్మేలా అధికారులు చూడాలని సీఎం ఆదేశించినట్లు కన్నబాబు వెల్లడించారు. వేరుశనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని... మిల్లెట్ ప్రాసెసింగ్‌కు వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారన్నారు. ప్రతి నియోజకవర్గంలో మార్కెట్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి