గుంటూరు జిల్లా నరసరావుపేట శివారులోని నున్న దేవి ఎంటర్ప్రైజెస్ ఆయిల్ మిల్లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న కాలువ శ్రీనివాసరావు(45)ను.. దుండగులు హత్య చేశారు. నరసరావుపేట గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం గ్రామానికి చెందిన కాలువ శ్రీనివాసరావు కొంతకాలంగా పట్టణ శివారులోని దేవి ఎంటర్ ప్రైజెస్‌లో వాచ్మెన్ గా పనిచేశాడు. ఎప్పటిలాగే బుధవారం రాత్రి కాపలాకు వచ్చి నిద్రించగా.. అతని నుదుటిపై గుర్తుతెలియని దుండగులు కొట్టి చంపారని పోలీసులు తెలిపారు. స్థానికులు అందించిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టామన్నారు.
ఇదీ చదవండి: