KA Paul Dance with Kids in Chandur : మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా చండూర్ మండలం తస్కానిగూడెం, బంగారిగడ్డ గ్రామాల్లో ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రచారం నిర్వహించారు. కేఏ పాల్ ఎక్కడ ఉంటే అక్కడ సందడి వాతావరణం నెలకొంటోంది. తస్కానిగూడెం గ్రామంలో చిన్న పిల్లలతో కలిసి డాన్స్‌లు వేశారు. బంగారిగడ్డ గ్రామంలో గ్రామస్థులతో కలిసి 'టీ' తాగారు.
అవినీతి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎందుకు ఓటెయ్యాలని కేఏ పాల్ ప్రశ్నించారు. 'నిన్న బహిరంగ సభలో డ్యాన్స్‌లు వేసే వారికి ఓట్లు వేయోద్దు అన్నారు కదా, మీకెందు ఓటేయాలి మరి.. 9 లక్షల కోట్లు అవినీతి చేసినందుకా, కుటుంబ పాలన చేస్తునందుకా, తాగి ఫామ్‌హౌస్‌లో పడుకునందుకా' అని కేసీఆర్‌ను కేఏ పాల్ ప్రశ్నించారు.
ఇవీ చదవండి..