ETV Bharat / state

Justice Bhattu Devanand concerned on the delay in the trial of cases కోర్టుల్లో కేసుల విచారణ ఆలస్యం.. ఓ పెద్ద చర్చనీయాంశం: జస్టిస్‌ భట్టు దేవానంద్‌

Justice Bhattu Devanand key comments on the delay in the trial of cases: న్యాయస్థానాల్లో కేసుల విచారణ ఆలస్యంపై మద్రాసు హైకోర్టు జడ్జి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. సామాన్యుల కేసులు ఏళ్ల తరబడి విచారణ సాగుతుంటే.. ప్రముఖులు, కార్పొరేట్ల కేసులు మాత్రం త్వరగా పరిష్కారమవుతున్నాయని అన్నారు. కేసుల విచారణ త్వరగా ముగిసేలా న్యాయవాదులు చొరవ చూపాలని జస్టిస్‌ బట్టు దేవానంద్‌ పిలుపునిచ్చారు.

Justice_ Bhattu_ Devanand_ key comments_on_dealy_cases_2023

author img

By

Published : Aug 12, 2023, 4:41 PM IST

Justice Bhattu Devanand concerned on the delay in the trial of cases : న్యాయస్థానాల్లో కేసుల విచారణ ఆలస్యం కావడంపై మద్రాసు హైకోర్టు జడ్జి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో దాదాపు 5 కోట్ల పెండింగ్‌ కేసులు ఉండటం ఆందోళన కలిగిస్తున్న అంశామని పేర్కొన్నారు. కోర్టుల్లో సామాన్యుల కేసులు ఏళ్ల తరబడి విచారణ సాగుతుంటే.. ప్రముఖులు, కార్పొరేట్ల కేసులు మాత్రం త్వరగా పరిష్కారమవుతున్నాయని జస్టిస్‌ భట్టు దేవానంద్‌ గుర్తు చేశారు.

All india Lawyers Union meetings started in Guntur.. అఖిల భారత న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో గుంటూరులో రాష్ట్ర మహా సభలు ప్రారంభం అయ్యాయి. రెండు రోజులపాటు జరిగే ఈ సభలకు A.I.L.U (ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌) మద్రాసు హైకోర్టు జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ A.I.L.U రాష్ట్ర మహాసభల్ని చెన్నై హైకోర్టు జడ్జి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీనియర్, జూనియర్ న్యాయవాదులు తలపెట్టిన ఈ సదస్సు విజయవంతం కావాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా న్యాయవ్యవస్థలో ఉన్న లోపాలపై జస్టిస్‌ బట్టు దేవానంద్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ఉన్న (సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టులు) న్యాయస్థానాల్లో కేసుల విచారణ ఆలస్యం కావడం ఓ పెద్ద చర్చనీయాంశమన్నారు. ఇప్పటికీ దేశంలో దాదాపు 5 కోట్ల పెండింగ్‌ కేసులు ఉన్నాయన్న జస్టిస్‌ బట్టు దేవానంద్‌.. ఇది ఆందోళన కలిగించే అంశామని పేర్కొన్నారు.

CID notices: సీఐడీ వల్ల భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం: న్యాయవాదులు

Justice Bhattu Devanand comments.. ''న్యాయస్థానాల్లో సామాన్యుల కేసులు ఏళ్ల తరబడి విచారణ సాగుతున్నాయి. ప్రముఖులు, కార్పొరేట్ల కేసులు మాత్రం త్వరగా పరిష్కారమవుతున్నాయి. పెద్ద నేరాల్లో ప్రముఖులుంటే మాత్రం కేసులు అంగుళం కూడా కదలవు. కేసు విచారణ త్వరగా ముగిసేలా న్యాయవాదులు చొరవ చూపాలి. న్యాయవాదులు చొరవ చూపినప్పుడే బాధితులకు న్యాయం జరుగుతుంది. దేశంలో 5 కోట్ల పెండింగ్ కేసులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. బార్ కౌన్సిల్, కోర్టు బెంచ్ సమన్వయంతో కేసులు త్వరగా పరిష్కరించాలి. న్యాయవాదులకు మంచి నైపుణ్యాలు తప్పనిసరిగా ఉండాలి. జడ్జిల నియామకంపై ఇటీవల పార్లమెంటు స్టాండింగ్ కమిటీ సూచనలు అనుసరణీయం. న్యాయవాదులపై జరిగే దాడులను అందరూ ఖండించాలి.'' అని జస్టిస్‌ భట్టు దేవానంద్‌ పిలుపునిచ్చారు.

Lawyers strike: నల్లకోటుపై లాఠీ.. ఆందోళనలో న్యాయ సమాజం

Justice Devanand lamented the delay in hearing the cases: ప్రజల కోసం న్యాయ వ్యవస్థ బలంగా నిలబడుతుంటే.. కొందరు మాత్రం న్యాయ వ్యవస్థ ఉనికిని ప్రశ్నించటం చాలా బాధాకరమని జస్టిస్ భట్టు దేవానంద్ ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యుల కేసులు ఏళ్ల తరబడి విచారణ సాగుతుంటే.. ప్రముఖులు, కార్పొరేట్ల కేసులు మాత్రం త్వరితగతిన పరిష్కారమవడం విచారకరమన్నారు. అదే పెద్ద నేరాల్లో ప్రముఖుల పాత్ర ఉంటే మాత్రం ఆ కేసులు ఏళ్ల తరబడిన అంగుళం కూడా కదలవనే విషయం అందరికి తెలుసునని వ్యాఖ్యానించారు. కేసు విచారణ త్వరగా ముగిసేలా న్యాయవాదులు చొరవ చూపాలని.. అప్పుడు మాత్రమే బాధితులకు న్యాయం జరుగుతుందని..జస్టిస్ భట్టు దేవానంద్ అభిప్రాయపడ్డారు.

Lawyers Protest For High Court: 'అక్కడ.. ఇక్కడ.. రాజధాని ఎక్కడ..? రాయలసీమ ద్రోహి జగన్'

Justice Bhattu Devanand concerned on the delay in the trial of cases కోర్టుల్లో కేసుల విచారణ ఆలస్యం.. ఓ పెద్ద చర్చనీయాంశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.