ETV Bharat / state

జీజీహెచ్​లో జూనియర్ డాక్టర్ల ఆందోళన.. స్టైఫండ్​ చెల్లించాలని డిమాండ్​ - గుంటూరు జీజీహెచ్ వార్తలు

గుంటూరు జీజీహెచ్​లో జునియర్ వైద్యులు ఆందోళన చేపట్టారు. పెండింగ్​లో ఉన్న స్టైఫండ్​ను తక్షణమే చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు సామాన్య, అత్యవసర సేవలను నిలిపివేసి ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

junior doctors agitation at guntur ggh to provide their pending stipend
స్టైఫండ్​ను చెల్లించాలని జీజీహెచ్​లో జూనియర్ డాక్టర్ల ఆందళన
author img

By

Published : Mar 5, 2021, 4:41 PM IST

పెండింగ్​లో ఉన్న స్టైఫండ్​ను తక్షణమే చెల్లించాలంటూ.. గుంటూరు జీజీహెచ్​లో జూనియర్ వైద్యులు ఆందోళన బాట పట్టారు. 6 నెలలుగా స్టైఫండ్ రాక అనేక ఇబ్బందులు పడుతున్నామని.. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే పెండింగ్​లో స్టైఫండ్​ చెల్లించాలని డిమాండ్ చేశారు. 2020 మార్చిలో హౌస్ సర్జన్​గా చేరిన జూనియర్ వైద్యులకు.. 6 నెలలుగా స్టైఫండ్ రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని వాపోయారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు సామాన్య, అత్యవసర సేవలను నిలిపివేసి ఆందోళన కొనసాగిస్తామన్నారు. అధికారులు తమకు.. లిఖితపూర్వక హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

'ఉక్కు' ఆందోళనలో.. వైకాపా, తెదేపా మధ్య వాగ్వాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.