జిల్లాలో ఇళ్ల పట్టాలు అందజేసిన ప్రాంతాల్లో రోడ్లు, డ్రైన్లు అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమర్రు, గుదేవారి పాలెం గ్రామాల పరిధిలో పట్టణంలోని లబ్ధిదారులకు అందజేసిన నివేశన స్థలాలను జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్, సబ్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్, ఆర్ అండ్ బి ఎస్ఈ మాధవి సుకన్యలు పరిశీలించారు. రెండు ప్రాంతాల్లో ఉన్న 175 ఎకరాల్లో యుద్ధ ప్రాతిపదికన రహదారులు, డ్రెయిన్ల నిర్మాణం పనులు చేపట్టి పూర్తి చేయాలని ఆదేశించారు. జేసీతో పాటు నరసరావుపేట సబ్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్, ఆర్అండ్బీ ఎస్ఈ మాధవి సుకన్య, ఈఈ రాజా నాయక్, డీఈ పున్నయ్య చౌదరి, తాహసీల్దార్ సుజాత, పురపాలక కమిషనర్ రవీంద్ర పాల్గొన్నారు.
ఇవీ చూడండి..: జై అమరావతి అంటూ.. పెళ్లి వేడుకలో వధూవరుల నినాదాలు