Janasena party candlelight rally : గుంటూరు జిల్లా తాడేపల్లిలో దుండగుడి చేతిలో ప్రాణాలు కోల్పోయిన అంధ బాలిక ఆత్మకు శాంతి చేకూరాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉండవల్లి లో పార్టీ కార్యకర్తలు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టారు. నిందితుడు కుక్కల రాజును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గన్ కంటే ముందు జగన్ వస్తాడని శాసనసభలో చెప్పిన మంత్రి రోజా ఎక్కడున్నారని ప్రశ్నించారు.. అత్యంత భద్రత ఉండే తాడేపల్లిలో మహిళలపై జరిగే ఆఘాయిత్యాలను ఆపలేకపోతున్నారని.. పార్టీ నేతలు విమర్శించారు. గంజాయి, మత్తు పదార్థాలు విక్రయాలు జోరుగా సాగుతున్నా.. పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బాధిత కుటుంబానికి 10 లక్షలు ఇచ్చాం.. అని చేతులు దులుపుకోకుండా నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఏమైందంటే: తాడేపల్లిలోని సీఎం నివాసానికి కూతవేటు దూరంలో ఓ బాలిక దారుణ హత్యకు గురైంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న అంధురాలైన బాలికపై అదే ప్రాంతంలో ఉంటున్న దుండగుడు కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. దాడి చేసిన వ్యక్తిని రాజుగా గుర్తించారు. గంజాయి మత్తులో అతడు ఈ దాడి చేసినట్లు సమాచారం. రాజు ఆ బాలికతో అసభ్యంగా ప్రవర్తించడంతో.. విషయాన్ని బంధువులకు చెప్పింది. దీంతో స్థానికులు అతడిని మందలించారు. ఈ నేపథ్యంలో కక్ష పెంచుకున్న అతడు.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. సీఎం నివాసానికి సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.
విచ్చలవిడిగా మత్తుపదార్థాలు: తాడేపల్లిలో విచ్చలవిడిగా మత్తుపదార్థాలు దొరుకుతున్నాయని ఆరోపించారు. గట్టి చర్యలు తీసుకోవాలని అధికార పార్టీ నాయకులే పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. రాజు తరచు గంజాయి సేవించి మహిళలను వేధిస్తున్నాడని.. గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. పోలీసులు చర్యలు తీసుకుని ఉంటే ఈ రోజు ఘటన జరిగి ఉండేది కాదన్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం జరిగిందని ఆరోపించారు.
ఇవీ చదవండి: