ETV Bharat / state

గుంటూరు జిల్లాలో జలజీవన్ మిషన్ పథకం అధికారుల పర్యటన - గుంటూరు జిల్లాలో జలజీవన్ మిషన్ అధికారుల పర్యటన వార్తలు

గుంటూరు జిల్లాలో జలజీవన్ మిషన్ అధికారుల బృందం పర్యటించింది. ఇంటింటికీ రక్షిత నీటి సరఫరాపై డ్వాక్రా సంఘాల సభ్యులు, సచివాలయ సిబ్బంది, ఏఎన్​ఎంలతో మాట్లాడారు. పథకం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

jaljeevan mission officers
గుంటూరు జిల్లాలో జలజీవన్ మిషన్ పథకం అధికారుల పర్యటన
author img

By

Published : Dec 4, 2020, 3:03 PM IST

ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందింజే జలజీవన్ మిషన్ పథకం అమలుపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా జలజీవన్ మిషన్ అధికారుల బృందం గుంటూరు జిల్లాకు వచ్చింది. ఏపీ గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో కలిసి జొన్నలగడ్డ, దుగ్గిరాల మండలం చిలువూరు, ప్రత్తిపాడు మండలం కొండ జాగర్లమూడిలో పర్యటించారు.

ఇంటింటికీ రక్షిత నీటి సరఫరాపై డ్వాక్రా సంఘాల సభ్యులు, గ్రామ సచివాలయ సిబ్బంది, ఏఎన్ఎంలతో మాట్లాడారు. పథకం గురించి వారికి అవగాహన కల్పించారు. మనం తాగే నీటిని తరచుగా పరిక్షించుకోవటం ద్వారా రోగాల బారిన పడకుండా కాపాడుకోవచ్చని అధికారులు తెలిపారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని వారికి సూచించారు.

జల జీవన్ మిషన్ గ్రామస్థాయిలో అమలు కోసం ప్రత్యేక కమిటీలను నియమిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పథకం క్రింద ఎంపిక చేసిన గ్రామానికి 60లక్షల రూపాయల నిధులను కేంద్రం అందిస్తుంది. ఈ నిధులతో నీటి సరఫరాకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాల్సి ఉంటుందని తెలిపారు. కుళాయి కనెక్షన్ కోసం ఎస్సీ, ఎస్టీలు 15వందల రూపాయలు, మిగతావారు 3వేల రూపాయలు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది.

ఇవీ చదవండి..

భారీ వర్షంలోనూ.. జనసేనాని పర్యటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.