ETV Bharat / state

అధ్వానంగా సాగునీటి కాలువలు, డ్రైనేజీలు.. - గుంటూరు జిల్లా తాజా వార్తలు

DRAINS ARE DIRE POSITION AT GUNTUR: దట్టంగా పెరిగిపోయిన కంపచెట్లు, పేరుకుపోయిన గుర్రపుడెక్క, అడుగుల మేర పూడిక.. ఇవీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో సాగునీటి కాలువలు, డ్రెయిన్ల పరిస్థితి. కనీస మరమ్మతులు, నిర్వహణ లేకపోవటంతో భారీ వర్షాలు, వరదల సమయంలో నీరు పొలాల్ని ముంచెత్తుతోంది. ఫలితంగా అన్నదాతలకు కన్నీరే మిగులుతోంది. పాత బిల్లులు చెల్లించకపోవటంతో గుత్తేదారులు ముందుకు రాక పనులు జరగటం లేదు. కొన్ని చోట్ల రైతులే చందాలు వేసుకుని బాగుచేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది.

DRAINS ARE DIRE POSITION AT GUNTUR
DRAINS ARE DIRE POSITION AT GUNTUR
author img

By

Published : Mar 8, 2023, 10:30 AM IST

ఉమ్మడి గుంటూరులో అధ్వానంగా సాగునీటి కాలువలు, డ్రైనేజీలు.. చివరకి అన్నదాత కంట్లో కన్నీరు

DRAINS ARE DIRE POSITION AT GUNTUR: ప్రకాశం బ్యారేజీ ఆయకట్టు కింద గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలో 5.70 లక్షల ఎకరాల సాగుభూములున్నాయి. వీటికి సాగునీరు అందించే కాలువలు, పొలాల నుంచి మురుగునీరు వెళ్లే డ్రెయిన్లు కనీస నిర్వహణ లేక అధ్వానంగా తయారయ్యాయి. 2, 3 అడుగుల మేర పెరిగిపోయిన పూడిక, పిచ్చిమొక్కలు పెరిగి కాలువలు కనిపించకుండా పోయిన పరిస్థితి. దీంతో భారీ వర్షాలు వచ్చినా, కృష్ణానదికి వరద పోటెత్తినా నీరు పొలాలపైకి ప్రవహిస్తోంది.

ముఖ్యంగా వరి పంట ఆఖరు దశలో తుపాన్లు వస్తే డెల్టా భూముల్లో నీరు సకాలంలో వెళ్లకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మురుగు కాలువల్లో పిచ్చిమొక్కలు, పూడిక తొలగించి నీటిప్రవాహానికి ఉన్న అడ్డంకులు తొలగించాలి. కానీ నాలుగేళ్ల నుంచి సాగు, మురుగునీటి కాలువల్లో ఎలాంటి పనులు గానీ, మరమ్మత్తులు కానీ చేయలేదు.

కృష్ణా పశ్చిమ డెల్టాలో కీలకమైన కొమ్మమూరు కాలువ ఆధునికీకరణ వివిధ కారణాలతో ఆగిపోయింది. 410 కోట్ల రూపాయలతో చేపట్టిన పనుల్లో 30 కోట్ల పనులు కూడా పూర్తికాకుండానే సాంకేతిక కారణాలతో ఆపేశారు. అప్పటి నుంచి కొమ్మమూరు కాలువ నిర్వహణ చేపట్టకపోవడం వల్ల కాలువ కట్టలు బలహీనంగా తయారయ్యాయి. గుంటూరు వాహినిలోనూ తూటుకాడ, పిచ్చిమొక్కలు పెరిగి నీటిప్రవాహానికి అడ్డంకులు ఏర్పడ్డాయి.

" పాలకుల నిర్లక్ష్యంగా గత నాలుగు సంవత్సరాల నుంచి కాలువ మరమ్మతులు జరగలేదు. వర్షాకాలంలో భారీ వరదల కారణంగా పైనుంచి వచ్చే నీళ్ల వల్ల కాలువలు కోతకు గురవుతున్నాయి. కాలువకట్టలు మాత్రం చాలా బలహీనంగా ఉన్నాయి. గత సంవత్సం పంటలు అన్ని మునిగిపోయాయి. ఈ కాల్వ ద్వారా కొన్ని ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువలకు మరమ్మతులు చేపించాలని కోరుకుంటున్నాం"-వెంకటనరసింహారావు, చింతలపూడి గ్రామస్థుడు

డెల్టాలో సాగునీరు అందించే కాలువలు ఎంత కీలకమో మురుగునీటి కాలువలు అంతే ప్రాధాన్యం కలిగి ఉన్నాయి. ప్రతిఏటా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి మరమ్మతులకు అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తారు. అయితే ప్రస్తుతం నిధుల సమస్య తీవ్రంగా ఉంది. చివరగా 2019-20 సంవత్సరంలో కాలువలు, డ్రెయిన్ల మరమ్మతులు చేపట్టారు. అయితే పనులు చేసిన గుత్తేదారుల్లో చాలామందికి ఇప్పటికీ బిల్లులు రాలేదు.

20కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. బిల్లుల కోసం గుత్తేదారులు న్యాయస్థానాలకు వెళ్లారు. కోర్టు ఆదేశాలతో కొందరికి చెల్లింపులు చేశారు. మరికొందరికి అలాగే ఉండిపోయాయి. పనులు చేపట్టడానికి గుత్తేదారులు ఆసక్తి చూపటం లేదు. దీంతో రైతులకు కష్టాలు తప్పడం లేదు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో అయితే చాలాచోట్ల రైతులే ముందుకు వచ్చి కాలువలు, డ్రెయిన్లు బాగు చేసుకున్నారు.

నీటి పారుదల శాఖ అధికారులు మాత్రం కాలువల మరమ్మతులు, డ్రెయిన్ల నిర్వహణకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామని, మరికొన్ని సిద్ధం చేస్తున్నామని తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.