గుంటూరు నగరంలోని సంగడిగుంట ప్రాంతానికి చెందిన బత్తిని చంద్రశేఖర్... ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చంద్రశేఖర్ చెడు వ్యసనాలకు బానిసై, దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలోనే చిలకలూరిపేటలో ఏడు ద్విచక్రవాహనాలు, పాత గుంటూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక బైక్, నల్లపాడు ఠాణా పరిధిలో ఒక ఆటో, ప్రకాశం జిల్లా చీరాల వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక బైకు, ఒంగోలు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక బైకు, ఒక ఆటో దొంగిలించాడు.
చిలకలూరిపేట పట్టణంలో జరుగుతున్న ద్విచక్రవాహనాల దొంగతనాలపై నరసరావుపేట డీఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక బృందంగా ఏర్పడిన అర్బన్ సీఐ బిలాల్ ఉద్దీన్, ఎస్సై షఫీ లు బుధవారం సాయంత్రం ఆర్టీసీ బస్టాండ్ వద్ద చంద్రశేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 10 బైకులు ,రెండు ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. అంతర్ జిల్లాల దొంగను అరెస్ట్ చేసిన సీఐ , ఎస్ఐలను డీఎస్పీ అభినందించారు.
ఇదీచదవండి.