గుంటూరు జిల్లా సంగం గోపాలపురం వద్ద ఒక రియల్ ఎస్టేట్ వెంచర్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పట్టుబడింది. ఈ విషయంపై సమాచారం అందటంతో పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనలో 220 బస్తాల రేషన్ బియ్యంతో పాటు.. అక్రమ బియ్యం వ్యాపారి సుబ్బారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వారు తెలిపారు.
ఇదీ చదవండీ.. గుంటూరు జిల్లాలో లారీ దూసుకెళ్లి ముగ్గురు మృతి