గుంటూరు జిల్లా చేబ్రోలులో... పీడీఎస్ బియ్యం తరలిస్తున్న రెండు లారీలను పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలోని పొందూరు మండలం చింతలపూడి గ్రామం ఎంఎస్ఆర్ రైస్ మిల్లు నుంచి రెండు లారీల్లో కాకినాడకు బియ్యం తరలిస్తుండగా చేబ్రోలు పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా చేబ్రోలు పోలీసులు పట్టుకున్నారని గుంటూరు సౌత్ అర్బన్ డీఎస్పీ కమలాకర్ తెలిపారు.
ప్రకాశం జిల్లాలో
ప్రకాశం జిల్లా మార్టూరులో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలోని జొన్నతాళి కూడలిలో ఎస్.ఐ శివకుమార్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా అక్రమంగా తరలిస్తున్న 70 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని... ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: