గుంటూరు జిల్లా గురజాల మండలం దైద, బట్రూవారిపాలెం గ్రామాల్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు తనిఖీలు నిర్వహించారు. సీఐ దేవర శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ సోదాలు చేశారు.
తెలంగాణకు చెందిన 400 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని నకరికల్లులో 160 మద్యం సీసాలు సీజ్ చేశారు. ఎవరైనా అక్రమ మద్యం రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చదవండి: