గుంటూరు జిల్లా నరసరావుపేటలో భార్యను భర్త హతమార్చాడు. సాయినగర్ నాల్గో లైన్‌లోని సాయికృష్ణ అపార్ట్మెంట్లో భార్యా భర్తల మధ్య జరిగిన గొడవలో భర్త ముస్తఫా క్రికెట్ బ్యాట్‌తో భార్యను తలపై కొట్టాడు. ఈ ఘటనలో హయత్ ఉన్నీసా అక్కడికక్కడే మృతి చెందింది. పది సంవత్సరాల క్రితం షేక్ ముస్తఫా, హయత్ ఉన్నీసాలకు వివాహమైంది. మృతురాలు హయత్ ఉన్నీసా బరంపేటలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. భర్త షేక్ ముస్తఫా మాత్రం పెళ్లైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. భర్త ఖాళీగా ఉండడంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈ గొడవలో భాగంగా భార్యను హతమార్చిన ముస్తఫా...కుమారుడిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ముస్తఫాను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు వన్ టౌన్ సీఐ బిలాలుద్దీన్ తెలిపారు.
ఇవీ చూడండి...