ETV Bharat / state

అనుమానంతో భార్యను నరికి చంపిన భర్త - గుంటూరు జిల్లా తాజావార్తలు

అనుమానం పెనుభూతంగా మారింది. కట్టుకున్న భార్యను..భర్త కత్తితో విచక్షణరహితంగా దాడి చేసి హతమార్చిన ఘటన గుంటూరులో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రక్తపు మడుగులో శీరీష
రక్తపు మడుగులో శీరీష
author img

By

Published : Mar 26, 2021, 5:10 PM IST

గుంటూరులోని శ్రీనివాసరావు తోటలో ఉండే శిరీషకు వెల్లలూరుకి చెందిన తిరుపతిరావుతో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య విభేదాలొచ్చాయి. అప్పటి నుంచి శిరీష గుంటూరులో తల్లివద్దే ఉంటుంది. విడాకుల కోసం ఇద్దరూ.. న్యాయస్థానంలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే శిరీష ప్రవర్తనపై అనుమానంతో.. గత కొంతకాలంగా ఆమెను హతమారుస్తానంటూ తిరుపతిరావు హెచ్చరిస్తున్నాడు.

ఈ రోజు తెల్లవారుజామున కొబ్బరి బొండాలు నరికే కత్తిని సంచిలో పెట్టుకొని వచ్చిన తిరుపతిరావు.. ఇంటిలో నిద్రిస్తున్న శిరీషను కత్తితో విచక్షణరహితంగా దాడి చేసి హత్య చేశాడు. అనంతరం తిరుపతిరావు అక్కడినుంచి పరారయ్యాడు. శిరీష తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నగరంపాలెం సీఐ మల్లికార్జునరావు తెలిపారు. మృతురాలికి 8 సంవత్సరాల కుమారుడు ఉన్నట్లు సీఐ చెప్పారు.

ఇదీ చదవండి: భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.