గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెదపరిమిలో 288 మంది లబ్ధిదారులకు.. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. గృహాల నిర్మాణానికి భూమిపూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి దాన్ని నెరవేరుస్తున్న ఘనత.. సీఎం జగన్‌కే దక్కుతుందని కొనియాడారు.
సీఎం జగన్ పాలనలో కుల, మత, రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులైన అందరికీ ఇళ్ల పట్టాలు అందిస్తామని.. ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు తెలిపారు. పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పేర్కొన్నారు. కొంతమంది న్యాయస్థానానికి వెళ్లడం వల్లే రాజధానిలో ఇళ్ల పట్టాల పంపిణీ ఆలస్యమవుతోందన్నారు.
ఇదీ చదవండి:
బాపట్ల కేంద్రంగా నాణ్యమైన ఆక్వా హేచరీ ఉత్పత్తులు.. పెరుగుతున్న ఎగుమతులు