ETV Bharat / state

వాలంటీర్ వ్వవస్థతో ప్రతిఇంటికీ సంక్షేమం: హోంమంత్రి సుచరిత - హోంమంత్రి

గ్రామ వాలంటీర్ వ్వవస్థతో ప్రతిఇంటికీ సంక్షేమం చేరుతుందని హోంమంత్రి మేకతోటి సుచరిత ఆశాభావం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం చింతపల్లిపాడులో అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు.

సమావేశంలో మాట్లాడుతున్న హోంమంత్రి సుచరిత
author img

By

Published : Aug 18, 2019, 4:51 PM IST

సమావేశంలో మాట్లాడుతున్న హోంమంత్రి సుచరిత

అధికారులతో మేకతోటి సుచరిత గుంటూరులోని చింతపల్లిపాడులో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హోంమంత్రి సుచరిత ... ప్రతి ఇంటికి సంక్షేమం చేర్చేవిధంగా వాలంటీర్ల వ్యవస్థతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తొలి అడుగు వేశారని అన్నారు. ప్రజలు దరఖాస్తు చేసిన 72 గంటల్లో సమస్య పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అక్టోబర్ నెల నుంచి సచివాలయలు ఏర్పాటు జరుగుతుందని చెప్పారు. రైతుల పంటకు సంబంధించి ధరల స్థిరీకరణకు 3 వేల కోట్లను ప్రభుత్వం కేటాయించినట్లు తెలిపారు. గ్రామాలకు తాగునీటి సమస్య లేకుండా చూసేందుకు వాటర్ గ్రిడ్​లు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజన్న రాజ్యం దిశగా ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నట్లు ఆమె వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి

వరదలో చిక్కుకున్న పోలీసు వాహనం

Intro:చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలంలో తెల్లవారుజాము నుండి ఎడతెరపి లేకుండా పడుతున్న జడివాన తో జనజీవనం స్తంభించింది. తెల్లవారుజాము నుండే వర్షం ప్రారంభమై అంతకంతకు బలంగా మారడంతో ప్రజా జీవనం స్తంభించింది.Body:గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో వర్షం కురుస్తున్నా వెదురుకుప్పం మండలం లో కురుస్తున్న వర్షం ఎక్కువగా ఉండడంతో బీడు భూముల్లో సైతం వర్షపు నీరు నిలిచి కనువిందు చేస్తోంది.Conclusion:ఎడతెరిపిలేని వర్షంతో చిన్నపాటి కాలువలు, వాగులు పొంగి ప్రవహిస్తూ సమీప చెరువులోకి నీరు చేరుతుందని అన్నదాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మహేంద్ర ఈటీవీ భారత్ జీడి నెల్లూరు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.