ETV Bharat / state

పొరపాటు జరిగింది.. క్షమించండి: హోంమంత్రి - Chilakalooripeta latest news

గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో సమాధులు పడగొట్టిన ఎస్సీ స్మశానవాటికను శనివారం సాయంత్రం ఎమ్మెల్యే విడదల రజిని, జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్​తో కలిసి హోంమంత్రి మేకతోటి సుచరిత పరిశీలించారు. అధికారుల నిర్లక్ష్యం, అత్యుత్సాహం కారణంగానే సమాధుల కూల్చివేత సంఘటన జరిగినట్లు సుచరిత పేర్కొన్నారు. సంఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని, పడగొట్టిన అన్ని సమాధులను తిరిగి నిర్మిస్తామని హామీఇచ్చారు. జరిగిన పొరపాటుకు క్షమించాలని హోంమంత్రి కోరారు.

Home minister visit Chilakalooripeta Crematorium place
పొరపాటు జరిగింది.. క్షమించండి: హోంమంత్రి
author img

By

Published : Sep 26, 2020, 8:22 PM IST

కొంతమంది అధికారుల నిర్లక్ష్యం, అత్యుత్సాహం వల్లనే పొరపాటున సమాధుల కూల్చివేత సంఘటన జరిగినట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో సమాధులు కూల్చిన శ్మశానవాటికను శనివారం సాయంత్రం హోంమంత్రి పరిశీలించారు.

శ్మశానవాటికలో సమాధుల కూల్చివేత ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు హోంమంత్రి తెలిపారు. సమాధులను పొరపాటున కూల్చడం కారణంగా సంబంధిత కుటుంబసభ్యుల మనోభావాలు దెబ్బతింటాయన్న సుచరిత... జరిగిన సంఘటన దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. పొరపాటుకు పెద్ద మనసు చేసుకుని క్షమించమని కోరుతున్నట్లు తెలిపారు. సంఘటనకు కారణమైన వారిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పడగొట్టిన అన్ని సమాధులను తిరిగి నిర్మించి ఇవ్వడమే కాక.. శ్మశానాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:

త్వరలో నాపై దాడి జరగబోతోంది: రఘురామకృష్ణరాజు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.